గత 17 నెలలుగా పాలన చేతకాక, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. కమిషన్‌లు తప్ప ప్రభుత్వానికి మరో దారి కనిపించట్లేదు. పాలన కనిపించడం లేదు అన్నారు. నల్గొండలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. డైరెక్ట్‌గా కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నా చేయడం వాస్తవ పరిస్థితిని స్పష్టం చేస్తోంది అన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే “కమిషన్‌లు లేనిదే పనులు జరుగడంలేదు” అని స్వయంగా సాక్ష్యంగా చెబుతున్నారు.. ఈ రాష్ట్రంలో కమిషన్‌ల పాలన నడుస్తోంది – ప్రజల పాలన కాదు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ని అడుగుతున్నా…SLBC టన్నెల్ కూలింది, 8 మంది ప్రాణాలు కోల్పోయారు,అక్కడ సహాయక చర్యలు చేపట్టే తెలివి కూడా లేకపోయింది అన్నారు.
మీ కమిషన్‌ల అరాటంతో మృతదేహాలను వెలికితీయడానికి సైతం సాహసం చేయలేకపోయారు….అక్కడ ఏం జరిగిందో ఇప్పటికీ చెప్ప లేని దద్దమ్మ ప్రభుత్వం ఇది.
..నల్గొండలో సుంకిషాల ప్రాజెక్ట్ కూలింది, ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు….కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయి, ప్రజల సమస్యలపై కాకుండా పచ్చినాటకంపై దృష్టి సారించిందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని బలిగొడుతున్నారు….ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తాయి. నిజాయితీ ఎప్పటికీ ఓడిపోదు అన్నారు. మీరు ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేని చేతకాని ప్రభుత్వం ఇది…తులం బంగారం ఏమైంది? 4 వేల రూపాయల పింఛన్లు ఏమయ్యాయి?, మీరు ఎంత నోటీసులు ఇచ్చినా అవి దూది పింజల్లా ఎగిరిపోతాయి అన్నారు. మీవి అన్ని చిల్లర ప్రయత్నాలు మాత్రమే. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించనున్నారు…రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి…ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయి అన్నారు.
Also Read:జగన్ వర్సెస్ రామానాయుడు

