బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా విజయవంతంగా కొనసాగుతూ రికార్డులను బద్దలు కొడుతోంది ఈ షో. ఇప్పటివరకు తెలుగు బుల్లితెర చరిత్రలోనే ఏ షోకి రాని రెస్పాన్స్ అన్‌స్టాపబుల్ షోకి వస్తోందని నిర్మోహమాటంగా చెప్పొచ్చు. బాలకృష్ణ హోస్టింగ్ ఈ షోకి మరింత వన్నె తీసుకొచ్చిందనే చెప్పాలి. తనదైన హాస్యం, డైలాగ్ డెలివరితో గెస్టులతో సరదా సరదాగా కామెడీ చేస్తున్న బాలకృష్ణ హోస్టింగ్‌తో ఈ షో అంచనాలకు మించి సాగుతోందన్న ప్రచారం కూడా సాగుతోంది.
ఇప్పటికే పలువురు సినీ రాజకీయ నాయకులు పార్టిసిపేట్ చేసిన ఈ షో ఎపిసోడ్స్ ఎంతటి ఘన విజయాన్ని అందుకున్నాయో మనకు తెలిసిందే. చంద్రబాబు, నారాలోకేష్, ఇటు కిరణ్ కుమార్ హాజరైన ఎపిసోడ్ లురికార్డులను బద్దలు కొట్టాయి. ఇక తాజాగా అన్ స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఎపిసోడ్ కూడా రికార్డులను తిరగరాయడం ఖాయమన్నా ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక తాజాగా అన్ స్టాపబుల్ షోకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ గా తెలంగాణ మంత్రి కేటీఆర్ రాబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. కేటీఆర్ తో పాటు రాంచరణ్ కూడా అన్ స్టాప్ బుల్ షోలో పాల్గొననున్నారంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. ఈ ఇద్దరితో అన్ స్టాపబుల్ నిర్వాహకులు షోను ప్లాన్ చేస్తున్నారని త్వరలోనే వీరిద్దరితో ఎపిసోడ్ షూట్ ప్రారంభం కాబోతుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఎపిసోడ్‌కు రాంచరణ్ ఇప్పటికే ఓకే చెప్పగా… మంత్రి కేటీఆర్ ఓకే చెప్పారా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే..