ఇంజనీరింగ్ విద్యార్దులకు అత్యుత్తమ శిక్షణ..

200
KTR addresses TASK meeting with College Correspondents
- Advertisement -

మారుమూల ఇంజనీరింగ్ విద్యార్దులకు అత్యుత్తమ శిక్షణ ఫలాలు అందేలా భాద్యత తీసుకుంటున్నామని ఐటి శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన ‘టాస్క్’ మరియు ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, విద్యాసంస్థల చైర్మన్లు, కంపెనీల ప్రతినిధుల సమావేశంలో మంత్రి ప్రసంగించారు. వివిధ సబ్జెక్టుల్లో డిగ్రీలు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉద్యోగాలు అందుకునేలా శిక్షణ ఇచ్చేందుకు తాము ‘టాస్క్’ ఏర్పాటు చేశామని, గత మూడు సంవత్సరాలుగా ‘టాస్క్’ అనుకున్న లక్ష్యాల మేరకు పని చేస్తుందని తెలిపారు. అయితే శిక్షణ విషయంలో మరింత ప్రగతి సాధించుకున్న, అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని, ఇందుకోసం రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ మరియు ఇతర వృత్తి విద్యా కళాశాలల సహకారం అందజేయాలని మంత్రి కోరారు.

KTR addresses TASK meeting with College Correspondents

తెలంగాణ ప్రభుత్వం పరిమాణం కంటే ప్రమాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నదని, అందుకోసమే రాష్ట్రంలో నాణ్యతలేని ఇంజనీరింగ్ కళాశాలల పైన గట్టి చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ కళాశాలలో విద్యా ప్రమాణాలు కొంత మెరుగుపడ్డాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం భారతదేశానికి ఉన్న గొప్ప బలం యువతరమని, ప్రపంచంలో ఏ దేశానికి లేనంత యువశక్తి మనదేశంలో ఉందన్నారు. పెద్దఎత్తున ప్రతి సంవత్సరం కళాశాలల నుంచి బయటకు వస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉన్న ప్రధానమైన బలహీనత కమ్యూనికేషన్ స్కిల్స్ అని తమకు పరిశ్రమ వర్గాలు తెలిపారన్నారు. దీంతోపాటు ఇంజనీరింగ్ విద్యకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జర్మనీ దేశ ప్రాక్టీస్ స్కూల్ విధానం తరహా ఇక్కడికి ఇంజనీరింగ్ విద్యార్థులను పరిశ్రమలో కనీసం ఒక ఏడాది పాటు ఇంటర్న్షిప్ ఇవ్వగలిగినప్పుడు వారి ఉద్యోగావకాశాలు మరింత పెరుగుతాయన్నారు.

KTR addresses TASK meeting with College Correspondents

ఆ దిశగా కాలేజీ యాజమాన్యాలు ఆలోచించాలని తెలిపారు. మరోవైపు ప్రభుత్వ శాఖల్లోని విద్యార్థులకు ఇంటర్నషిప్ అవకాశాన్ని కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి విద్యా సంస్థల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రం చేస్తున్న కార్యక్రమాలకు తోడుగా కళాశాలలో సొంతంగా పలు కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరముందని ఈ మేరకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం నుంచి అందిస్తామన్నారు. ఇప్పటికీ చాలా కళాశాలలు అత్యుత్తమ ప్రమాణాల కోసం ప్రయత్నం చేస్తున్నాయని, అయితే కొన్ని కళాశాలలకు ఉన్న వ్యాపార దృక్పథంతో విద్యార్థులు కొంత మేర నష్టపోతున్నారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

KTR addresses TASK meeting with College Correspondents

ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కళాశాలల యాజమాన్యాలు ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యాలను మంత్రి కోరారు. గ్రామీణ విద్యార్థులకు శిక్షణ ఇచ్చే విషయంలో ‘టాస్క్’ ప్రత్యేక శ్రద్ధ వహించి, వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టిందని ఇప్పటికే చాలా మందిని విజయవంతంగా పలు కంపెనీలు ఉద్యోగులుగా చేసిందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకుపోయేందుకు వరంగల్, నిజామాబాదు జిల్లాల్లో ‘టాస్క్’ ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. టాస్క్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గోని అత్యుత్తమ ఫలితాలు సాధించిన కాలేజీలకు, శిక్షణ కార్యక్రమాలు, విధ్యాభోధన వంటి పలు రంగాల్లో ముందు వరుసలో నిలిచిన పలు కాలేజీలకు ఈ సందర్భంగా మెమోంటోలను అందజేశారు.

- Advertisement -