ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మనసారా ఆశీర్వదిస్తున్న యావత్ మహిళా లోకానికి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్… మహిళా సంక్షేమంలో తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
కేసీఆర్ సర్కార్ అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి ఆరు పదులు దాటిన అవ్వల వరకు అందరినీ కంటికి రెప్పలా కాపాడుతుందని తెలిపారు. ఆకాశంలో సగం కాదు.. ఆమే ఆకాశం అని.. సంక్షేమంలో సగం కాదు.. ఆమే అగ్రభాగం అని పేర్కొన్నారు కేటీఆర్.
Also Read:ఛాతీలో మంట వస్తోందా..?
గుక్కెడు మంచినీళ్ల కోసం మైళ్లదూరం నడిచిన మహిళల కష్టాలను మిషన్ భగీరథతో శాశ్వతంగా తీర్చిన విజన్ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మన అంగన్వాడీలను, ఆశా కార్యకర్తలను వెవట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించి.. దేశంలోనే అత్యధిక పారితోషికాలు ఇచ్చి గౌరవప్రదంగా జీవించే అవకాశం కల్పించారన్నారు.
ఆకాశంలో సగం కాదు.. “ఆమే” ఆకాశం…
సంక్షేమంలో సగం కాదు.. ”ఆమే” అగ్రభాగం…మహిళా సంక్షేమంలో..
మన తెలంగాణ రాష్ట్రం..
యావత్ దేశానికే ఆదర్శం..అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి…
ఆరు పదులు దాటిన అవ్వల వరకు…
అందరినీ కంటికి రెప్పలా కాపాడుతోంది…
మనసున్న కేసీఅర్ సర్కార్… pic.twitter.com/yN4YacJ9Rp— KTR (@KTRBRS) June 13, 2023