ముక్కోటి వృక్షార్చన..జయప్రదం చేయండి

135
koti

తన పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 24 న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆద్వర్యంలో చేపట్టిన ముక్కోటి వృక్ష అర్చన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి నాకు జన్మదిన కానుకగా ఇవ్వండి అని ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్.

ఇక కేటీఆర్ తన బర్త్ డే సందర్భంగా ఎవరూ పూల బోకేలు తీసుకురావొద్దని ట్విట్టర్ వేదికగా కోరారు. గిఫ్ట్ ఏ స్మైల్‌ కార్యక్రమంలో భాగంగా తన బర్త్ డే రోజున దివ్యాంగులకు బైక్‌లను అందించనున్నారు కేటీఆర్. గత సంవత్సరం బర్త్ డే సందర్భంగా ఆంబులెన్స్‌లను అందించిన సంగతి తెలిసిందే.