‘ఛలో మేడిగడ్డ’.. లెక్క తేల్చుతాం!

18
- Advertisement -

గత బి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఏ స్థాయిలో బురద జల్లుతుందో అందరికీ తెలిసిందే. రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి పెట్టడం మాని గత ప్రభుత్వంలో జరిగిన లోపాలను ఎత్తిచూపేందుకే కాంగ్రెస్ పాలకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అందులో భాగంగానే కే‌సి‌ఆర్ ప్రభుత్వంలో రాష్ట్ర అప్పుల శాతం తారస్థాయికి చేరుకుందని, కే‌సి‌ఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని.. ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తూ వచ్చారు కాంగ్రెస్ నేతలు. అయితే కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలన్ని వట్టివే అని జాతీయ ఎకనామిక్ సర్వేలు తెచ్చి చెప్పుతున్నాయి.

ఇక బి‌ఆర్‌ఎస్ హయంలో పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లోపాలు ఉన్నాయని, అవినీతి జరిగిందని అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి హస్తం నేతలు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. మేడిగడ్డ ప్రాజెక్ట్ లో పగుళ్లను ఎత్తి చూపిస్తూ.. హస్తం నేతలు చేస్తున్న హడావిడిని రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అయితే మేడిగడ్డలో పొరపాట్లు జరిగాయని, దాన్ని సరిచేయాల్సిన బాద్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని స్వయంగా బి‌ఆర్‌ఎస్ అగ్రనేతలు చెబుతున్నప్పటికి.. కాంగ్రెస్ నేతలు మాత్రం బూతద్దంలో చూపించే విధానాన్ని అవలంభిస్తున్నారు.

కాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కొన్ని బ్యారేజ్ ల సమాహారం.. ఇది మరచి కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్న తీరు నిజంగా అందరికి ఆశ్చర్యానికి గురి చేసే అంశమే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలుకు చెక్ పెట్టేందుకు బి‌ఆర్‌ఎస్ పార్టీ ” ఛలో మేడిగడ్డ ” కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మార్చి 1 న బి‌ఆర్‌ఎస్ ఎమ్మేల్యేలు, ఎంపీలు, కీలక నేతలు అందరూ కూడా మేడిగడ్డ వసందర్శన కు వెళ్లనున్నట్లు బి‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కే‌టి‌ఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా అసలు నిజాలను బహిర్గతం చేయనున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు మొత్తానికి. మేడిగడ్డతో పాటు కాళేశ్వరంలోని ఇతర బ్యారేజ్ లపై కూడా సమగ్ర సమాచారాన్ని ప్రజలకు తెలిపేందుకు బి‌ఆర్‌ఎస్ సిద్దమైంది. దీంతో గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు బి‌ఆర్‌ఎస్ గట్టిగానే సమాధానం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read:ఫ్రిడ్జ్ లో వాటర్ తాగుతున్నారా..జాగ్రత్త!

- Advertisement -