KTR:మరో ఎమ్మెల్యే చేరికపై కేటీఆర్

19
- Advertisement -

భద్రాచలం ఎమ్మెల్యే తెల్రం వెంకట్రావ్ చేరికపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వెంకట్రావ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పొటోను ట్వీట్ చేస్తూ పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ నీతి అంటూ విమర్శించారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో రాజ్యాంగ పరిరక్షణ అనే చాప్టర్ 13వ పాయింట్ లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళితే వెంటనే అనర్హత వేటు పడేలా చట్ట సవరణ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ, తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ కేటాయించిందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ కండువాకప్పి కాంగ్రెస్ లో చేర్పించుకుంటుందని విమర్శించారు. గెలిచేంత వరకు ఒక మాట.. గెలిచాక ఇంకో మాట.. ఇదే కాంగ్రెస్ రీతి, నీతి. బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి తేడా ఏంటో చెప్పాలన్నారు.

Also Read:యాలకుల రసంతో ఉపయోగలెన్నో..!

- Advertisement -