KTR:లైఫ్‌ సైన్సెస్‌ రాజధానిగా హైదరాబాద్‌

54
- Advertisement -

ఎల‌క్ట్రానిక్స్ సిస్ట‌మ్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చ‌రింగ్ స్కిలింగ్ రంగంలో తెలంగాణ అగ్ర‌గామిగా కొన‌సాగుతోంద‌న్నారు మంత్రి కేటీఆర్. కోకాపేట‌లో మైక్రోచిప్ టెక్నాల‌జీ డిజైన్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్‌ను ప్రారంభించారు కేటీఆర్.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించామన్నారు. దేశానికి లైఫ్‌ సైన్సెస్‌ రాజధానిగా హైదరాబాద్‌ ఉందన్నారు.ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్‌ క్యాంపస్‌ హైదరాబాద్‌లో ఉందని వెల్లడించారు.

Also Read:త్రివిక్రమ్ – బన్నీ 4వ సారి

గ‌త రెండేళ్ల‌లో టెక్నాల‌జీ రంగంలో మూడో వంతు ఉద్యోగాలు హైద‌రాబాద్‌లోనే సృష్టించిన‌ట్లు తెలిపారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని… లైఫ్‌సైన్సెస్‌ రంగంలో హైదరాబాద్‌ గణనీయమైన అభివృద్ధి సాధించిందని తెలిపారు. సెమీకండ‌క్ట‌ర్ రంగంలో భార‌త్ ఇప్పుడిప్పుడే వృద్ధి చెందుతోంద‌న్నారు. వ‌చ్చే ద‌శాబ్ధంలో ఆ రంగంలో భార‌త్ దూసుకెళ్తుంద‌న్న విశ్వాసాన్ని మంత్రి వ్య‌క్తం చేశారు.

- Advertisement -