ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఆల్‌రౌండ్ ప్రతిభతో అదరగొట్టింది. ధావన్ సూపర్ ఇన్నింగ్స్‌కు తోడు కృనాల్ పాండ్యా,విరాట్ మెరుపులు తోడవడంతో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది భారత్. కోహ్లీ సేన విధించిన 318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 42.1 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. బెయిర్‌స్టో (66 బంతుల్లో 94; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) బెంబేలెత్తించిన అతడికి మిగితా ఆటగాళ్ల నుండి సహకారం లభించలేదు. దీంతో ఇంగ్లాండ్ ఓటమిని మూటగట్టుకుంది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 4, శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు పడగొట్టగా ధావన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆరంభం నుండే ఇన్నింగ్స్‌ని ధాటికి ప్రారంభించింది. ధావన్ (98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) తృటిలో శతకం చేజార్చుకోగా….అరంగేట్ర మ్యాచ్‌లో వేగవంతమైన అర్ధశతకం బాదిన ఆటగాడిగా కృనాల్ పాండ్యా (26 బంతుల్లో) రికార్డు సృష్టించాడు. రాహుల్ (43 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.
ఈ మ్యాచ్‌లో ఇరు జట్లలోనూ అన్నదమ్ములు కలిసి ఆడారు. భారత్ తరఫున కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా బరిలో దిగితే.. ఇంగ్లండ్ తరఫున టామ్ కరన్, సామ్ కరన్ కలిసి ఆడారు.