కృష్ణా నదీ యాజమాన్య బోర్డు భేటీ వాయిదా…

153
krmb
- Advertisement -

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు భేటీ వాయిదా పడింది. ఈ నెల 27న జరగాల్సిన సమావేశాన్ని సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు కేఆర్‌ఎంబీ సభ కార్యదర్శి. సెప్టెంబర్ 1న ఉదయం 11 గంటలకు సమావేశం జరుగుతుందని ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు సమాచారం పంపినట్లు పేర్కొన్నారు.

ఇప్పటికే సమావేశంలో చర్చించేందుకు 14 అంశాలతో కేఆర్‌ఎంబీ ఎజెండా తయారు చేసింది. బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం తాగునీటి కోసం వినియోగించే జలాలు 20 శాతం మాత్రమే లెక్కించాలని కేఆర్ఎంబీకి లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించేందుకు వెలిగొండ ప్రాజెక్టును చేపట్టిందని, ఈ అక్రమ ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే ఆపివేయించాలని విజ్ఞప్తి చేసింది.

- Advertisement -