బాలీవుడ్ స్టార్ బ్యూటీ కృతి సనన్ తన పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్స్‌తో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా కృతి సనన్, ఆమె బాయ్‌ఫ్రెండ్ కబీర్ బహియా విడిపోయారంటూ సోషల్ మీడియాలో వస్తున్న బ్రేకప్ రూమర్స్‌కు ఆమె గట్టి సమాధానం ఇచ్చారు.
కబీర్ బహియాతో కలిసి ఎంతో క్లోజ్‌గా ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫోటోను కృతి షేర్ చేశారు. ఈ ఫోటోతో తామిద్దరం ఇంకా ప్రేమలోనే ఉన్నామని స్పష్టం చేస్తూ, వస్తున్న పుకార్లన్నింటికీ ఒక్క దెబ్బతో చెక్ పెట్టారు. ఈ క్యూట్ పిక్ చూసిన అభిమానులు “బెస్ట్ కపుల్” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Also Read:ఎమ్మెల్యే రాజగోపాల్..సెన్సేషనల్ కామెంట్స్
మరోవైపు కృతి సనన్ కెరీర్ పరంగా కూడా టాప్ గేర్‌లో దూసుకుపోతున్నారు. బాలీవుడ్ క్లాసిక్ హిట్ ‘కాక్‌టెయిల్’ సీక్వెల్ ‘కాక్‌టెయిల్ 2’లో ఆమె నటించనున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది.
దీనితో పాటు, బాలీవుడ్ చాక్లెట్ బాయ్ షాహిద్ కపూర్ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్టు గురించిన ముచ్చట్లు కూడా నెట్టింట సందడి చేస్తున్నాయి.

