ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటా:బాలీవుడ్ బ్యూటీ

278
prabhas
- Advertisement -

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌ ప్ర‌భాస్. ఆయన పెళ్లి పీట‌లెక్కుతాడ‌నేది ఇంకా సస్పెన్స్‌గానే ఉండగా ప్ర‌భాస్‌ని పెళ్లి చేసుకుంటానని తన మనసులోని మాటను బయటపెట్టింది బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ న‌టిస్తున్న ఆదిపురుష్ చిత్రంలో హీరోయిన్‌గా సీత పాత్ర‌లో మెప్పించనుంది కృతి.

ఈ సందర్భంగా ప‌లువురు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పింది. ప్రభాస్‌, టైగర్‌ ష్రాఫ్‌, కార్తీక్‌ ఆర్యన్‌ ఈ ముగ్గురి హీరోల్లో మీరు ఎవరితో డేట్‌కు వెళతారు? ఎవర్ని వివాహం చేసుకుంటారు? ఎవర్నీ ఫ్లర్ట్‌చేస్తారు? అని తెలపగా ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానని, టైగర్‌ ష్రాఫ్‌తో డేటింగ్‌కు వెళతానని, కార్తీక్‌ ఆర్యన్‌ను ఫ్లర్ట్‌ చేస్తానని కృతీ సనన్‌ చెప్పారు. ప్ర‌భాస్‌-కృతి న‌టిస్తున్న‌ ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల చేయనున్నారు. వ‌న్ నేనొక్క‌డినే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌య‌మైంది కృతి స‌న‌న్.

- Advertisement -