ఉప్పెన సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కృతి తర్వాత అగ్రహీరోలతో నటించే అవకాశాన్ని కొట్టేసింది. అయితే ఎంత తక్కువ సమయంలో టాప్ హీరోయిన్స్ సరసన చేరిందో అంతే షార్ట్ టైంలో మరుగన పడిపోయింది.
నితిన్, సుధీర్ బాబు, రామ్‌లతో కలిసి నటించిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద బోళ్తాపడ్డాయి. దీంతో అందరి హీరోయిన్ల మాదిరిగానే అందాల ఆరబోతకు పనిచెప్పింది. సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ యువతను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది.
అయితే తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన వార్త నెట్టింట్లో వైరల్‌గా మారింది. కెరీర్‌లో మంచి జోష్‌లో ఉన్నప్పుడే ఈ అమ్మడికి బాలీవుడ్ ఆఫర్ వచ్చిందట. అయితే ఈ ఆఫర్‌ని అప్పుడు తిరస్కరించిందట. ఇప్పుడు ఈ విషయం బయటకు రావడంతో అమ్మడు చేసింది తప్పు అంటూ అంతా వాపోతున్నారు. తన కెరీర్‌లో కృతి బాలీవుడ్‌కి నో చెప్పి పెద్ద తప్పుచేసిందని మరికొంతమంది వాపోతున్నారు. ఏదిఏమైనా కృతి చాలా పెద్ద తప్పుచేసిందని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి..