‘కృతి – దిశా’ల మధ్య అల్లు అర్జున్

16
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప ది రైజ్‌’కు సీక్వెల్‌గా వస్తోన్న చిత్రం ‘పుష్ప.. ది రూల్‌’. అయితే, ఈ మూవీ నుంచి కీలక అప్ డేట్ వచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్‌, కృతిసనన్‌, దిశాపటానీ పై వచ్చే ఓ సాంగ్‌ను రామోజీఫిలిం సిటీలో చిత్రీకరించినట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. కాగా, పుష్ప ది రూల్‌ 2024 ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుందని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. అందుకే, బ్యాలెన్స్ పార్ట్ షూటింగ్ ను శరవేగంగా చేస్తున్నారు. ఇందులో భాగంగానే, కృతిసనన్‌ – దిశాపటానీల పై ప్రత్యేక పాటను తీస్తున్నారు.

పుష్ప 2 సినిమాతో ఎలాగైనా బాలీవుడ్ లో పాగా వేయాలని అల్లు అర్జున్ ఆశ పడుతున్నాడు. సినిమాకి ఓవర్ బడ్జెట్ అయినా, నిర్మాతలు మాత్రం బన్నీ కోరిక తీర్చడానికి రిస్క్ చేసి మరీ, డబ్బులు పెడుతున్నారు. అన్నట్టు పుష్ప 2 మూవీకి సంబంధించి మరో వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది. రెండో పార్ట్ తో సినిమా అయిపోదని, మూడో భాగం కూడా ఉంటుందనే రూమర్లు వస్తున్నాయి. సుకుమార్ అయితే ఇంకా ఎక్కడా దీని గురించి చెప్పలేదు కాబట్టి.. ప్రస్తుతానికి ఇది నిజం కాకపోవచ్చని అభిమానులు అంటున్నారు.

ఐతే, పుష్ఫ మూడో పార్ట్ కూడా ఉంటే.. అల్లు అర్జున్ మరో ఏడాది పాటు సుకుమార్ కే డేట్స్ కేటాయించాల్సి వస్తోంది. ఒకవేళ, మూడో పార్ట్ లేకపోతే.. అల్లు అర్జున్ తర్వాత సినిమాలపై చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో బన్నీ ఓ సినిమా చేయనున్నారని, ఆల్రెడీ సంతకం కూడా చేసేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని టాలీవుడ్ సర్కిళ్లలో చర్చ జరుగుతోంది.

Also Read:మెగ్నీషియం లోపిస్తే.. ఇన్ని సమస్యలా?

- Advertisement -