‘కృష్ణార్జున యుద్ధం’ ట్రైల‌ర్..

208
Krishnarjuna Yuddham Trailer
- Advertisement -

నేచుర‌ల్ స్టార్ నాని తాజా చిత్రం కృష్ణార్జున యుద్ధం. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈ చిత్ర ఆడియో వేడుక శనివారం సాయంత్రం తిరుప‌తిలోని నెహ్రూ మున్సిప‌ల్ గ్రౌండ్‌లో గ్రాండ్‌గా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇక హీరో నాని సినిమా అంటేనే మినిమం గ్యారంటీ కాదు.. ఇప్పుడు మ్యాగ్జిమం గ్యారంటీ అయిపోయింది. న్యాచురల్ స్టార్ మూవీ అంటే చాలు.. జనాలు ఇరగబడి థియేటర్లకు వచ్చేస్తున్నారు.

Krishnarjuna Yuddham Trailer

కృష్ణార్జున యుద్ధం ట్రైలర్ ద్వారా కథ ఏంటి అనే విషయాన్ని చెప్పేశారు. సినిమాకు ఇద్దరు హీరోలు.. ఇద్దరూ నానీలే. పల్లెటూరిలో ఉండే కృష్ణ.. సిటీ గై అర్జున్. కనిపించిన అమ్మాయికల్లా సైట్ కొట్టి తిట్లు తినడం కృష్ణకు అలవాటు. పెళ్లి చేసుకుంటావా అని అడిగిన అమ్మాయి చెప్పు చూపిస్తే.. ‘చెప్పు మాత్రమే చూపించిందంటే.. ఈ అమ్మాయి ఊరికి కొత్తనుకుంటా’ అంటాడు కృష్ణ. అదీ ఈ పాత్ర క్యారెక్టర్. ‘ఒక అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమించడం.. ఇటాలియన్ మాఫియాతో పెట్టుకోవడం రెండూ ఒకటే’ అంటాడు అర్జున్ పాత్రలోని నాని.

అలాంటి ఈ ఇద్దరు చెరో అమ్మాయిని తెగ ప్రేమించేస్తారు. ఆ తర్వాత వారి ప్రేమలకు ఎలాంటి కష్టాలు వచ్చాయి. పల్లెటూరి నాని.. సిటీ నానికి కూడా ఎలా హెల్ప్ చేశాడు.. అన్నదే సినిమా. ఈ మూవీలో కూడా క్లీన్ కామెడీనే అందించబోతున్నాడు నాని. ‘సిగరెట్ యాడ్ లో ద్రావిడ్ లాగా అర్ధం కాకుండా మాట్లాడుతున్నాడేంట్రా’ అంటూ సైడ్ క్యారెక్టర్ పేల్చిన జోక్ బాగా పేలింది. కృష్ణ పాత్రలో చిత్తూరు యాస.. సిటీ హీరోగా పోష్ లాంగ్వేజ్ రెండింటినీ నాని ఇరగదీసేశాడు. ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్.. రుష్కర్ ధిల్లాన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుద‌ల కానుంది.

- Advertisement -