కృష్ణార్జున యుద్ధం..టీజర్

283
Krishnarjuna Yuddham Teaser Announcement Poster
- Advertisement -

వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని. ఎంసీఏ సినిమాతో డబుల్ హ్యాట్రిక్‌ని తన ఖాతాలో వేసుకున్న నాని ప్రస్తుతం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఫేం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మార్చి 10న ఉదయం 10 గంటలకు సినిమా టీజర్‌ని విడుదల చేయనున్నారు. టీజర్ రిలీజ్‌ డేట్‌కు సంబంధించి పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. పోస్టర్‌లో నాని స్టైల్ అందరిని ఆకట్టుకుంటుండగా రేపు విడుదల కానున్న టీజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇటీవలె సినిమా నుంచి విడుదల చేసిన లవ్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నా కనులే కనని ఆ కలనే కలిశా.. నీ వలనే బహుశా ఈ వరస అంటూ నాని విరహాగీతాన్ని ఆలపించగా నెటిజన్ల గుండెలను హత్తుకుంది.

నాని ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ చిత్రంలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, రుక్స‌ర్ మీర్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హిప్ హాప్ త‌మిళ‌, సినిమాటోగ్ర‌ఫీ: కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని, ఆర్ట్‌: సాహి సురేష్‌, నిర్మాత‌లు : సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది, ద‌ర్శ‌క‌త్వం : మేర్ల‌పాక గాంధీ.

- Advertisement -