జురాలకు కృష్ణమ్మ పరుగులు…

651
jurala project
- Advertisement -

నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక రెండురోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో పలు ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది.ఇక మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిలోకి భారీగా వరద నీరు చేరుతోంది.

దీంతో ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాంలు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోగా అధికారులు దిగువకు నీరు వదిలి పెడుతున్నారు. దీంతో కృష్ణమ్మ జురాల వైపు పురగులు పెడుతోంది.

ఆల్మట్టి ప్రాజెక్టులో ఎగువ నుంచి 88 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. 98 వేలు క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు ఆరు వరద గేట్ల ద్వారా 58 వేల క్యూసెక్కులు, విద్యుత్తు ఉత్పత్తి ద్వారా 40 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.

నారాయణపూర్‌ జలాశయంలోనూ 1.02 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో ఆదివారం అర్ధరాత్రి దిగువకు లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో ఇవాళ కృష్ణ నీళ్లు జూరాలకు రానున్నాయి. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 1.98 క్యూసెక్కుల నీరు నిల్వ ఉంది. ఇది 2.88 టీఎంసీలకు చేరుకుంటే ఎత్తిపోతల పథకాలకు నీటి సరఫరా ప్రారంభమవుతుంది.

- Advertisement -