కొత్త ప్రాజెక్టులు కట్టలేదు: తెలంగాణ ప్రభుత్వం

540
krishna river
- Advertisement -

కృష్ణా,గోదావరి బేసిన్లలో కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశానికి ముందే సమాధానం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం…తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులు ఉమ్మడి ఏపీలో మొదలుపెట్టినవేనని పేర్కొంది.

ఏపీ తలపెట్టిన పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, సంగమేశ్వరం ప్రాజెక్టులే కొత్తవని తెలిపింది తెలంగాణ సర్కార్. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు విషయమై ఉమ్మడి ఏపీలో సర్వే చేయలేదని, సంగమేశ్వరం కూడా పూర్తిగా కొత్తదేనని పేర్కొంది.కృష్ణా జలాల్లో ఇప్పటికే ఏపీ పరిమితికి మించి వాడుకుంటోందని.. పైగా మిగులు జలాలను తీసుకెళ్తామని దబాయిస్తోందని కృష్ణాబోర్డుకు రాసిన లేఖలో తెలిపింది.

కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులు అక్రమమని ఆరోపిస్తూ.. ఏపీ సర్కారు రివర్ బోర్డులకు ఫిర్యాదు చేయగా అపెక్స్‌ ‌కౌన్సిల్‌‌, సీడబ్ల్యూసీ, రివర్‌ ‌బోర్డు అనుమతి లేకుండా చేపడుతున్న ప్రాజెక్టుల పనులు ఆపాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది. ఈ క్రమంలో రెండు నదుల మేనేజ్మెంట్ బోర్డులు మీటింగ్‌‌లు నిర్వహిస్తుండగా కృష్ణానది యాజమాన్యబోర్డు సమావేశానికి ముందే సమాధానం చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.

- Advertisement -