కృష్ణమ్మ ఉగ్రరూపం…

243
krishna river
- Advertisement -

భారీవర్షాలు, వరదలతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. దీనికి తోడు ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం డ్యామ్‌కు వరద పోటు ఆగడం లేదు. పది గేట్లను 25 అడుగుల వరకు ఎత్తి నీటిని నాగార్జున సాగర్‌కు వదిలారు.

ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు ఇతర మార్గాల నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు.

వరద ముంపు గ్రామాల్లో ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వాన వీడినా ఎగువ నుంచి వస్తున్న వరద నీరు కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలోని ఉప్పుటేరు ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఆకివీడు, కాళ్ల మండలాలు వరద ముంపునకు గురయ్యాయి. గుంటూరు జిల్లాలోని కృష్ణానది తీరప్రాంత లంక గ్రామాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. కరోనా భయంతో కొన్ని లంక గ్రామాల్లో ప్రజలు పి వరద నీటితో నిండిన ఇళ్లలోనే కాలం వెళ్లదీస్తున్నారు

- Advertisement -