కృష్ణా నదీ నిపుణుల కమిటీ వీడియో కాన్ఫరెన్స్..

219
Krishna River Board Video Conference
- Advertisement -

ఈరోజు కృష్ణా నదీ యాజమాన్య నిపుణుల కమిటీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీ, తెలంగాణ ఛీఫ్ ఇంజనీర్లు, కేఆర్ఎంబి మెంబర్ హరీశ్ మీనా, ఢిల్లీ నుంచి ఐఎంఓ ఛీఫ్ ఇంజినీర్ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో కృష్ణా బేసిన్‌లో మిగులు జలాల కేటాయింపు పై చర్చ. జరగనుంది. జూన్ మాసం నుంచి నూతన వాటర్ ఇయర్ ప్రారంభం కానుండటంతో ఇరు రాష్టాలకు నీటి కేటాయింపులు చేయాలని కేఆర్ఎంబి నిర్ణయం తీసుకుంది.

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంపు, శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాజెక్టుకు ప్రతిరోజూ 3 టీఎంసీల నీటిని తరలించాలని ఏపీ ప్రభుత్వం 203 జీవో విడుదలపై ప్రశ్నించనున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే కృష్ణా బోర్డు ఇంచార్జి చైర్మన్ చంద్రశేఖర్ అయ్యార్‌ను కలిసి ఏపీ నిర్మించ తలపెట్టిన కొత్త ప్రాజెక్టును నిలిపివేయాలని తెలంగాణ నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ ఫిర్యాదు చేయనున్నారు.

- Advertisement -