జలసౌధలో కృష్ణా నదీ బోర్డు సమావేశం..

235
Krishna River Board
- Advertisement -

హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశం చైర్మన్ పరమేశం అధ్యక్షతన జరుగుతోంది. కృష్ణా నదిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టుల నిర్మాణమే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో.. డీపీఆర్‌లతో పాటు నీటి కేటాయింపులు, టెలీమెట్రీ సహా ఇతర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదీపై సంగమేశ్వర్ వద్ద పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు ఒకరిపై మరోకరు ఫిర్యాదు చేసుకోవడంతో ఈ సమావేశం కీలకంగా మారింది. ఇక 12 ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను అధికారులు సిద్ధం చేశారు. ఈ బేటీలో ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శులు, ఇరిగేషన్ ఛీఫ్ ఇంజినీర్లు,ఇతర ఇంజనీరింగ్ అధికారులు హాజరైయ్యారు.

- Advertisement -