- Advertisement -
టోక్యో పారాలింపిక్స్ భారత అథ్లెట్లు స్వర్ణాల పంట పండిస్తున్నారు. ఆదివారం భారత్‌కు మరో బంగారు పతకం లభించింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్‌హెచ్ 6లో కృష్ణ నాగర్ గోల్డ్ మెడల్ సాధించాడు. హాంకాంగ్ ప్లేయర్ కైమన్ చూతో జరిగిన ఫైనల్‌లో 21-17, 16-21, 21-17తో విజయం సాధించాడు. దీంతో బ్యాడ్మింటన్‌లో బంగారు పతకం సాధించిన రెండో ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. శనివారం జరిగిన ఎస్‌ఎల్ 3 విభాగంలో ప్రమోద్ భగత్ గోల్డ్ సాధించిన విషయం తెలిసిందే.
అలాగే బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో భారత షట్లర్ సుహాస్ యతిరాజ్ ఈ ఉదయం రజత పతకం గెలుచుకున్నాడు. తాజా పతకంతో కలిపి భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 19కు పెరిగింది. వీటిలో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ ప్రస్తుతం 24వ స్థానంలో ఉంది.
- Advertisement -