మహేష్‌ పాత్రలో ప్రభుదేవా..!

442
- Advertisement -

పోకిరి చిత్రాన్ని హిందీలో ‘వాంటెడ్’ పేరుతో సల్మాన్ ఖాన్ తో రీమేక్ చేసి బాలీవుడ్ లోనూ సూపర్ హిట్ కొట్టిన డాన్సింగ్ సెన్సేషన్ ప్రభుదేవా హీరోగా నటిస్తున్న తమిళ చిత్రాన్ని తెలుగులో ‘కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్’ పేరుతో విడుదల చేస్తున్నారు. పోకిరిలో మహేష్ బాబు పోషించిన డేర్ డెవిల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పేరు ‘కృష్ణమనోహర్’ అన్న విషయం తెలిసిందే.

Prabhudeva & Nivetha

పవనపుత్ర ప్రొడక్షన్స్ పతాకంపై యనమల సుధాకర్ నాయుడు సమర్పణలో.. సీనియర్ ప్రొడ్యూసర్ ఆర్.సీతారామరాజు నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ తమిళ, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 7న విడుదల కానుంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభుదేవా నటిస్తున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్. బాహుబలి ప్రభాకర్, సురేష్ మీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Krishna Manohar IPS

తమిళంతోపాటు తెలుగులో సైమల్టేనియస్ గా ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని.. ప్రేమికుడుగా, దర్శకుడిగా అలరించిన ప్రభుదేవా.. సంఘవిద్రోహశక్తుల పాలిట సింహస్వప్నంగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాడని సుధాకర్ నాయుడు చెబుతున్నారు.

- Advertisement -