ఖైదీ వర్సెస్‌ శాతకర్ణి…రూమర్స్‌కు చెక్‌

250
- Advertisement -

సంక్రాతి వచ్చిందటే చాలు ప్రజలకే కాదు టాలీవుడ్‌లో కూడా పండగ వాతావరణం నెలకొంటుంది. సంక్రాంతి సీజన్‌లో సినిమాలు వస్తే సూపర్‌ హిట్టే అని కొంత మంది హీరోల సెటిమెంట్‌. ఈ సంక్రాంతి పండగకి రెండు ప్రతిష్టాత్మక చిత్రాలు విడుదల కానున్నాయి. అందులో మెగాస్టార్‌ తొమ్మిద సంవత్సరల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఖైదీనెం150 , అలాగే బాలకృష్ణ నటించిన వందోచిత్రం గౌతమిపుత్రశాతకర్ణి ఈ రెండు సినిమాలపై ఇప్పటికే భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్నాయి.

Krish puts Jan 11 release rumours to rest

ఖైదీనెం 150 జనవరి 11వ తేదిన, శాతకర్ణి జనవరి 12వ తేదిన విడుదలకానున్నాయి. సంక్రాంతికి ఇద్దరు స్టార్‌ హీరోలు రంగలోకి దిగడంతో పోరు రసవతరంగా మారనుంది. దీంతో బాలయ్య చిరు తాడోపేడో తెల్చుకోబోతున్నారని ఫ్యాన్స్‌ మధ్య వార్‌ నెలకొంది ఈనేపధ్యంలో ఇలా సినిమాలపై వస్తున్న రూమర్లకు చెక్‌పెట్టడానికి క్రిష్‌ ఒక ట్వీట్‌ చేశాడు.‘ఈ సంక్రాంతికి తమ ప్రతిష్టాత్మక సినిమాలతో వినోదం అందించడానికి ఇద్దరు లెజెండ్స్‌ వస్తున్నారు. వారికి స్వాగతం పలుకుదాం’ అని ట్వీట్‌ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ రూమర్లకి క్రిష్ చెక్‌ పెట్టినట్లే కనిపిస్తుంది.

Krish puts Jan 11 release rumours to rest

రాంచరణ్‌ కూడా ఈ రెండు సినిమాలపై స్పందించారు….ఇద్ద‌రు అగ్ర‌హీరోల సినిమాలు ఒకే రోజున రావ‌డం ఇండ‌స్ట్రీకి అంత మంచి ప‌రిణామం కాద‌ని నాన్న‌గారు చెప్ప‌డంతో ఒక‌రోజు ముందుగా అంటే జ‌న‌వ‌రి 11న విడుద‌ల చేస్తున్నాం. అలాగే.. జ‌న‌వ‌రి 4న జ‌ర‌గాల్సిన `ఖైదీనంబ‌ర్ 150` ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ గ్రౌండ్ ప‌ర్మిష‌న్ ప్రాబ్లమ్ కార‌ణంగా జ‌న‌వ‌రి 7న విజ‌య‌వాడ – గుంటూరు మ‌ధ్య‌లో ఉన్న హాయ్‌ల్యాండ్‌లో చేస్తున్నాం“ అని రాంచరణ్‌తెలిపారు.

- Advertisement -