గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి” వంటి వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు క్రిష్. గౌతమి పుత్ర శాతకర్ణి’ ఘన విజయం తరువాత, క్రిష్ మరో చారిత్రక చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ‘ఝాన్సీ లక్ష్మీబాయి’ జీవిత చరిత్రను తెరకెక్కించడానికి ఆయన రంగాన్ని సిద్ధం చేసుకున్నాడు. ‘ఝాన్సీ లక్ష్మీబాయి’ అసలు పేరు ‘మణికర్ణిక’ కావడంతో అదేపేరును టైటిల్‌గా ఖరారు చేసుకున్నాడు క్రిష్.హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఏకకాలంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది.. ఏప్రిల్ 27, 2018 విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
కంగనా రనౌత్ ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం షూటింగు దశలో వుంది. ఇప్పటికే కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేసిన క్రిష్, తాజా షెడ్యూల్ ను హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశాడు.
ప్రతి నాయకుడికి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను ఆయన తెరకెక్కిస్తున్నాడు. ఈ నెల 9వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ లో కంగనా రనౌత్ పాల్గొననుంది. 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ ఆమె కాంబినేషన్లోని యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. హిందీతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ‘శాతకర్ణి’ తరువాత క్రిష్ చేస్తోన్న ఈ చారిత్రక చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.