బిగ్‌బాస్‌లో పైసా వసూల్…!

202
Bigg Boss Telugu Vote
- Advertisement -

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ ఇప్పటివరకు ఏ షో సాధించని విధంగా టీఆర్పీ రేటింగ్‌ సాధించి ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఇప్పటివరకు 16 ఎపిసోడ్స్‌లో పెద్దగా హంగామా లేకపోయిన 17వ ఎపిసోడ్ మాత్రం వివాదాలతో హీట్ పెంచేసింది. –

బిగ్ బాస్ హౌస్‌లోని కుటుంబ సభ్యుల కోసం లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా ‘ఒప్పో పైసా వసూల్’ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. హౌస్‌లో తినడానికి, సిగరెట్ కాల్చడానికి, హౌస్ లోని వస్తువులను ఉపయోగించడంతో పాటు.. బాత్ రూమ్‌కి వెళ్లాలన్నా డబ్బులు చెల్లించే ప్రతి పనిచేయాలి. ఇందుకోసం హౌస్‌లో ఉన్న కుటుంబ సభ్యులు వసూలు దారులు, వినియోగదారులుగా రెండు గ్రూపులుగా విడిపోయారు.

ఇందులో సెలబ్రిటీలు లగ్జరీ బడ్జెట్ కోసం వివిధ పాత్రల్లో లీనం అయిపోయినటించారు. ప్రిన్స్, అర్చనలు మొగుడు పెళ్లాలుగా జీవించేశారు. ధనరాజ్‌ను గోపీ.. గోపీ అంటూ హరితేజ ముద్దుగా పిలుస్తూ పనిపనిషిగా అదరగొట్టేసింది. ఇక గేమ్‌లో భాగంగా రెండు వేరు వేరు గ్రూపుల్లో ఉన్న ప్రిన్స్, శివబాలీజీల మధ్య చిన్న వివాదం రేగింది. ప్రిన్స్ గేమ్‌ని గేమ్‌లా ఆడటం లేదని స్వార్థంతో ఆలోచిస్తున్నావ్ అంటూ ఫైర్ అయ్యాడు బాలాజీ.

మరోవైపు హౌస్‌లో కొత్తగా వచ్చిన దీక్ష తనకు హౌస్ ఫ్రీగా లేదని.. తనను కార్నర్ చేస్తున్నారని అనిపిస్తుందని.. బాత్రూంకి పోవాలన్నా పర్మిషన్ అడగాల్సివస్తుందని కత్తి కార్తీకతో అనడంతో నువ్ ఎలా ఉండాలంటే అలా ఉండు లైట్ తీసుకోమంటూ కార్తీక ధైర్యం చెప్పింది. ఇక రేపటి ఎపిసోడ్‌లో ‘ఒప్పో పైసా వసూల్’ విన్నర్ ఎవరో తేలనుంది.

- Advertisement -