మహానటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతి నేడు. అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో తనదైన ప్రతిభ కనపర్చాడు ఎన్టీఆర్. సినిమాల పరంగాకానీ, రాజకీయ రంగంలో కానీ చాలా మందికి ఆయన ఆదర్శంగా నిలిచారు. ఇప్పటికి చాలామంది ఎన్టీఆర్ ను తలచుకోవడం విశేషం. ఎంతో మంది కొత్త వాళ్లను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. రాజకీయాల్లో కొత్త దనాన్ని సృష్టించాడు. యువ నాయకత్వానికి నాంది పలికాడు స్వీర్గియ ఎన్టీఆర్. తెలుగు ప్రజలకు చిరకాలం గుర్తుండిపోయే వ్యక్తిగా పేరుతెచ్చుకున్నాడు ఎన్టీఆర్.
నేడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఎన్టీఆర్ షూట్ వద్ద ఆయన సమాధికి నివాళులర్పించారు. నందమూరి హరికృష్ణ, పురందేశ్వరీ, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు క్రిష్ కూడా ఆయన సమాధి వద్ద నివాళులర్పించి.. స్మరించుకున్నారు. ఈసందర్భంగా తెలుగు రాష్ట్రాలకు ఆయన చేసిన సేవలను పలువురు నాయకులు గుర్తుచేశారు.
ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడు క్రిష్ ఈసందర్భంగా ఎన్టీఆర్ గురించి మాట్లాడాడు. తెలుగువారి ఖ్యాతిని దశదిశలా వ్యాప్తిచేసిన మహానటుడు ఎన్టీఆర్ అన్నారు. ఆయన జీవిత చరిత్ర తెరకెక్కించి జాతి మొత్తానికి అందించే గొప్ప అవకాశాన్ని కలగజేసిన నటసింహం బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. నన్ను నమ్మి ఈ బయోపిక్ ను నాకు అప్పజెప్పినందుకు ఆ నమ్మకాన్ని నిలబెడతానన్నారు. త్వరలోనే నటినటునలను ఎంపీక చేసి షూటింగ్ మొదలుపెడతామన్నారు.