- Advertisement -
పవన్ కళ్యాణ్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు. తొలుత ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించగా ఆ తర్వాత జ్యోతికృష్ణ ఎంటర్ అయ్యారు. పవన్‌తో విభేదాల కారణంగానే క్రిష్ తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవన్‌తో విభేదాలపై స్పందించారు క్రిష్. పవన్ కళ్యాణ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్‌తో మళ్లీ పని చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధమని అన్నారు. HHVM కి ఇద్దరికీ దర్శకత్వ క్రెడిట్ రావడం గురించి మాట్లాడుతూ, అసలు కారణం త్వరలో బయటపడుతుందన్నారు.
పవన్ కళ్యాణ్ కృష్ణకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ముఖ్యంగా ఆయన కథకు. పవన్ అభిమానులు కూడా ఇద్దరి కలయిక మళ్లీ జరగాలని ఆశిస్తున్నారు.
Also Read:నారా రోహిత్.. బర్త్ డే స్పెషల్
- Advertisement -

