శ్రీ ఎస్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై విన్ను జయత్, స్నేహ శర్మ జంటగా శ్రీకాంత్ దర్శకత్వంలో గిరి పయ్యావుల నిర్మిస్తోన్న చిత్రం కిరాతకుడు
. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఈ రోజు తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిఎఫ్‌సిసి ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ టీజర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..`కిరాతకుడు` చిత్ర నిర్మాత గిరి మా ఊరి వాస్తవ్వుడు. నాకు మంచి మిత్రుడు. తను సినీ రంగంలోకి అడుగుపెడుతూ తొలిసారిగా నూతన తారాగణాన్ని పరిచయం చేస్తూ `కిరాతకుడు` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టీజర్ చాలా క్వాలిటీతో బావుంది. దర్శకుడి ప్రతిభ ఏంటో టీజర్ చూస్తే అర్థమవుతుంది. అలాగే హీరో హీరోయిన్స్ కూడా కథకు తగ్గట్టుగా కుదిరారు. చిరంజీవిగారి టైటిల్ లో వస్తోన్న ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ చిత్ర యూనిట్ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మా తెలంగాణ ఫిలించాంబర్ లో 126 సినిమాలు సెన్సార్ జరుపుకున్నాయి. దీంతో 127 సినిమాలు. మా చాంబర్ ద్వారా విడుదలయ్యే ప్రతి సినిమాకు రిలీజ్ విషయంలో నా వంతు సహకారం అందించినట్టుగానే ఈ సినిమాకు కూడా అందిస్తాను. ఇక కరోనా క్రైసిస్ లో ఎంతో మందికి మా చాంబర్ తరపున నిత్యావసరాలు అందించాం. ప్రభుత్వం కూడామా ఛాంబర్ కు ఎంతో సహకారం అందిస్తోంది. త్వరలో ఐదు ఎకరాలు భూమి కూడా మా ఛాంబర్ కోసం కేటాయిస్తుందన్న నమ్మకంతో ఉన్నాం
అన్నారు.
జడ్జి మధుసూదనరావు మాట్లాడుతూ..టీజర్ చాలా బావుంది. చిన్న చిత్రాలు, కొత్త వారు చేస్తున్న ప్రయత్నాలను ఆదరించాలని కోరుకుంటున్నా
అన్నారు.హీరో విన్ను జయత్ మాట్లాడుతూ…హీరోగా నేను నటిస్తోన్న తొలి చిత్రమిది. నాకు ఒక మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు
అన్నారు.
దర్శకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ…ప్రతాని రామకృష్ణగారి చేతుల మీదుగా మా సినిమా టీజర్ ఆవిష్కరణ జరగడం ఎంతో సంతోషంగా ఉంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు చాలా వచ్చినప్పటికీ ...క్రైమ్ ని కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశాం. హీరో హీరోయిన్స్ పోటీ పడి నటించారు. మా నిర్మాత సినిమాట పట్ల ఎంతో పాషన్ తో వచ్చారు. ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు
అన్నారు.
నిర్మాత గిరి పయ్యావుల మాట్లాడుతూ…15 ఏళ్లుగా నేను జర్నలిజంలో ఉన్నాను. చిన్నప్పటి నుంచి సినిమా రంగంపై ఆసక్తి. ఒక మంచి సినిమా చేయాలన్న కోరికతో మెగాస్టార్ చిరంజీవి గారి సూపర్ హిట్ సినిమా టైటిల్ తో తొలిసారిగా `కిరాతకుడు` సినిమాను నిర్మించాను. టీజర్ కార్యక్రమం ప్రతాని రామకృష్ణ గారి చేతుల మీదుగా జరగడం ఆనందంగా ఉంది. దర్శకుడు శ్రీకాంత్ కొత్త కథతో ఈ సినిమాను అందరికీ నచ్చేలా తెరకెక్కించాడు. చిరంజీవి గారి టైటిల్ ని చెడగొట్టకుండా సినిమా చేశాం
అన్నారు.
టీఎఫ్ సిసి సెక్రటరీ కాచెం సత్యనారాయణ, టీ మా
జాయింట్ సెక్రటరీ మహేశ్వరి మాట్లాడుతూ…టీజర్ బావుంది, సినిమా విజయవంతమై యూనిట్ కి మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నాం
అన్నారు. హీరోయిన్ స్నేహశర్మ మాట్లాడుతూ…“ అవకాశం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఫణి కుమార్, కీర్తి కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః వినోద్; సినిమాటో్గ్రఫీః మార్క శ్రీకాంత్ గౌడ్ ; నిర్మాతః గిరి పయ్యావుల; దర్శకుడుః శ్రీకాంత్ .