ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

6
- Advertisement -

పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ స్పీకర్ దగ్గర గత ఏడాదిన్నరగా పెండింగ్ లో ఉంది అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్.మూడు నెలల్లో ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడం చరిత్రాత్మకం అన్నారు.

ఉపఎన్నికలు ఎలా వస్తాయని అసెంబ్లీలో సుప్రీంకోర్టును తప్పు పట్టేలా వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డికి ఈ తీర్పు చెంపపెట్టు లాంటిది అన్నారు. రేవంత్ అధికారమదంతో రాచరికాన్ని తలపించేలా మాట్లాడిన వ్యాఖ్యలకు విరుద్ధంగా నేడు సుప్రీంతీర్పు ఇచ్చింది. సుప్రీం తీర్పు మీద ఏ మాత్రం నమ్మకమున్నా పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ మారగానే సభ్యత్వాన్ని కోల్పోయేలా చట్టం తెస్తామని పాంచ్ న్యాయ్ సూత్రాల్లో అది ఒకటని రాహుల్ చెప్పారు. మేనిఫెస్టోలో పెట్టిన దానిపై ఏ మాత్రం గౌరవమున్నా ఎమ్మెల్యేల అనర్హత వేటు కోసం చొరవ చూపాలి అన్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీది ఒక మాట.. గల్లీలో రేవంత్ ది ఇంకో మాట ఉంది అన్నారు.

Also Read:ఇంతకన్నా ఏం కావాలి: విజయ్

- Advertisement -