సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ సునీల్ దత్

514
Kothagudem Sp Sunil Dath
- Advertisement -

సైబర్ నేరాల పట్ల ఖమ్మం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్. ఈసందర్భంగా నేడు ఖమ్మంలోని ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత కాలంలో నేరస్తులు సులభంగా డబ్బు సంపాదించడానికి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో “PF ఖాతా ఉన్నవారికి బంపర్ ఆఫర్” అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజ్ ను ఎవరూ నమ్మవద్దని చెప్పారు. ఇలాంటి మెసెజ్ లను వార్తల రూపంలో మీడియాలో ప్రచారం చేస్తూ అమాయక ప్రజల నుండి ఆన్లైన్ ద్వారా డబ్బులు దోచుకోవడమే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు ఎన్నో విధాలుగా ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు.

PF ఖాతా కలిగి ఉన్న అందరికి EPFO(ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) నుండి 80,000/-రూపాయల ఆఫర్ అని ప్రచారం అయ్యే వార్తలను నమ్మి మోసపోవద్దు.ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని, ఇలాంటి వార్తలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని EPFO సంస్థ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చింది. ఇలాంటి ఎన్నో రకాల ఆన్లైన్ లింక్స్,బ్యాంకు సిబ్బంది లాగా ఫోన్లు చేయడం ద్వారా నిత్యం చాలామంది అమాయకులు సైబర్ నేరాలకు బలవుతున్నారు.జిల్లాలో సైబర్ నేరాలపై పోలీసుల ఆధ్వర్యంలో మరియు కళాబృందం ద్వారా ఎన్నో అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

- Advertisement -