ఇది ప్రజల విజయం:ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి

604
kotha prabhakar reddy
- Advertisement -

మెదక్ పార్లమెంట్ అభ్యర్ధిగా భారీ మెజార్టీతో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. సీఎం కేసీఆర్ ఆశీస్సులు,హరీష్ రావు సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందన్నారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ వచ్చిందన్నారు.

మెదక్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిషలు కృషి చేస్తానిన తెలిపిన ఆయన కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకొచ్చేలా చేస్తానని వెల్లడించారు. ఈ విజయంతో తనపై బాధ్యత మరింత పెరిగిందన్నారు.

ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా మెదక్ అభివృద్ధి కోసం కోసం మరింత పాటుపడతామని హరీష్‌ రావు వెల్లడించారు. ప్రతిపక్షాలకు మెదక్ ప్రజలు మరోసారి బుద్ది చెప్పారన్నారు ఎమ్మెల్యే రామలింగారెడ్డి. సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు సహకారంతో మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి కాళేశ్వరం నీళ్లు తెచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని వెల్లడించారు.

పెద్దపల్లి టీఆర్ఎస్ అభ్యర్ధి బోర్లకుంట వెంకటేష్ నేత 84,302 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు లక్షా 66 వేల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్ధి రేణుకా చౌదరిపై గెలుపొందారు.

- Advertisement -