ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. తన ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరిపించాలని కేంద్ర హోమ్ శాఖకు ఫిర్యాదు చేశారు. నా వ్యక్తిగత అంశాలను ట్యాపింగ్ చేశారని అమిత్ షాకు రాసిన లేఖలో కోటంరెడ్డి పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నేను చెప్పినప్పటినుంచి వైసీపీ నేతలు నన్ను టార్గెట్ చేశారని నన్ను అరెస్ట్ చేయిస్తాం అంటూ బెదిరిస్తున్నారని..ఎన్నిసార్లు, ఎటువంటి బెదిరింపులకు పాల్పడినా నేను నిజాలు మాట్లాడుతునే ఉంటానని స్పష్టం చేశారు. నాపై ఎన్ని కేసులు పెట్టినా నా గొంతు ఆగదు..అరెస్ట్ చేస్తానని బెదిరించటం కాదు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పండి అంటూ సవాల్ విసిరారు.
కాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కోటంరెడ్డి ఆరోపణలు చేసిన మరునాడే మరో వైసీపీ నేత..వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి కూడా తన ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటూ ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..