స్లీపర్ బస్సుల ప్రమాదాల పై అసెంబ్లీ సెషన్ లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. స్లీపర్ బస్సుల ప్రమాదాల వల్ల ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు..నిబంధనల ప్రకారం ఇద్దరు డ్రైవర్లు ఉండాల్సి ఉన్నా ఒక్కరే నడుపుతున్నారు అని మండిపడ్డారు.
సేఫ్టీ మెజర్స్ అసలు పాటించడం లేదు..ప్రైవేట్ డ్రైవర్లకు కనీసం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా నిర్వహించడం లేదు..కక్కుర్తికి లోబడి ఎమర్జెన్సీ ద్వారాలను మూసివేసి, అక్కడ కూడా స్లీపర్ బెర్త్‌లు ఏర్పాటు చేస్తున్నారు..10 ప్రమాదాలలో 8 నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయి అన్నారు
బాధ్యులపై కేవలం యాక్సిడెంట్ కేసులు కాకుండా హత్య కేసులు, పీడీ యాక్ట్ నమోదు చేయాలి..అభి బస్, రెడ్ బస్, మాయా బస్ లాంటి సంస్థలకు వందల కోట్లు వస్తున్నాయి..కానీ ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రావడం లేదు..తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల రవాణా మంత్రులతో మాట్లాడి..అన్ని ప్రైవేట్ టికెట్లను ఆర్టీసీ యాప్ పరిధిలోకి తీసుకురావాలని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి సూచించారు. ఆర్టీసీ యాప్ కంట్రోల్‌లో ఉంటే అన్ని రకాల సేఫ్టీ ప్రమాణాలు పాటించే ప్రైవేట్ బస్సులకే పర్మిషన్లు ఇవ్వడం సాధ్యమవుతుంది అని చెప్పారు మ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
ALso Read:రామమందిర విరాళాల చోరీ..తుది నివేదిక

