కోట బొమ్మ‌ళీ పీఎస్..పొలిటిక్ ఎజెండా లేదు

27
- Advertisement -

జోహ‌ర్‌, అర్జున ఫాల్గుణ చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకున్న ద‌ర్శ‌కుడు తేజ మార్ని. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వ‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’.రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్‌ రోల్స్‌లో న‌టించిన ఈ చిత్రంలో శ్రీ‌కాంత్‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌లు కీలకపాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబర్ 24న సినిమా విడుదలవుతున్సందర్భంగా ద‌ర్శ‌కుడు తేజ మార్ని మీడియాతో ముచ్చటించారు.

కోట బొమ్మాళీ క‌థ‌ను తెలుగులో చెప్పాల‌ని ఎందుకనిపించింది?
కొన్ని మంచి క‌థ‌లు అక్క‌డితో ఆగిపోకుండా, దానిని ప‌రిధిని పెంచాల‌ని, ఆ క‌థ‌ను మ‌రింత మందికి రీచ్ అవ్వాల‌ని చేసే ప్ర‌య‌త్న‌మే సినిమా. కోట బొమ్మాళీ పీఎస్ క‌థ‌ను కూడా ఎలాగైనా చెప్పాల‌ని గ‌ట్టిగా న‌మ్మాను. అలాంటి గొప్ప క‌థ ఇది. ముఖ్యంగా ఇందులో స్టిస్ట‌మ్‌లో వున్న వాళ్లు సిస్ట‌మ్‌కు బ‌లైతే ఎలా వుంటుంది అనే కాన్సెప్ట్ నాకు జ‌నాల‌కు చెప్పాల‌నిపించింది. నేడు వ్య‌వ‌స్థ‌లో జ‌రుగుతున్న రియ‌ల్టీ ఇది. కోట బొమ్మాళీ అనే ఊరిలో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్న సంద‌ర్భంలో ఏం జ‌రిగింది? అది ముగ్గురు పోలీస్ ఆఫీస‌ర్ జీవితాల‌ను ఎలా మార్చింది అనేది క‌థ

రీమేక్ క‌థ‌ను చెప్ప‌డానికి కార‌ణ ఏమిటి?
ఇది రీమేక్ అయినా కేవ‌లం వ‌ర్జిన‌ల్ క‌థ‌లోని సోల్ మాత్ర‌మే తీసుకున్నాను. మిగ‌తాది అంతా మ‌న నేటివిటికి మ‌న ఎమోష‌న్స్‌కు త‌గ్గ‌ట్టుగా మార్చుకున్నాం. థ్రిలింగ్‌గా వుండేలా, ప్రేక్ష‌కుల‌కు ఆస‌క్తి క‌లిగేలా ఓ థ్రిల్ల‌ర్‌లా మార్చాం. ముఖ్యంగా సెకండాఫ్ పూర్తిగా మార్చాం. ప్ర‌తి ఒక్క‌రూ థియేట‌ర్‌లో చూసి ఎక్స్‌పీరియ‌న్స్ అవ్వాల్సిన సినిమా ఇది. క‌మింగ్ జ‌న‌రేష‌న్‌కు రాజ‌కీయాలు, ఓటువిలువ‌, సిస్ట‌మ్‌లో సిట్చుయేష‌న్స్‌కు త‌గ్గ‌ట్టుగా ఎలా వుండాలి అనే విష‌యాల‌కు ఈ సినిమా ఓ రిఫ‌రెన్స్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.

ప్ర‌చార చిత్రాలు చూస్తుంటే స‌న్నివేశాలు చాలా రియ‌లిస్టిక్‌గా అనిపిస్తున్నాయి?
నా గ‌త సినిమాలు కూడా అలాగే వుంటాయి. ఈ సినిమా కోసం కూడా ప్ర‌తిది రియ‌లిస్టిక్‌గా వుండాల‌ని ఎంతో క‌ష్ట‌ప‌డ్డాం. రిస్క్ తీసుకున్నాం. ఈ చిత్రం చూస్తున్నంత సేపు ఆడియ‌న్స్ అంద‌రూ కోట బొమ్మాళి అనే ఊరిలో వున్న ఫీలింగ్ క‌లుగుతుంది.

ప్ర‌స్తుత రాజ‌కీయాల‌కు , ఈసినిమా క‌థ‌కు ఏమైనా సంబంధం వుంటుందా?
ప్ర‌జెంట్ రాజ‌కీయాల‌కు, ఈ సినిమాకు ఎటువంటి సంబంధం లేదు. కాక‌పోతే ఎన్నిక‌ల గురించి, ఓటు విలువ గురించి చ‌ర్చించాం. అయితే ఈసినిమాలో ఏ స‌న్నివేశం కాన ఓ పార్టీకి మ‌ద్ద‌తుగ వుండ‌దు. సిస్ట‌మ్‌, మ‌నం ఎలా క‌ర‌ప్ట్ అయి వున్నాం. అనేది ఈ చిత్రంలో చెబుతున్నాం. ఈ సినిమాకు ఏ పొలిటిక‌ల్ ఎజెండా లేదు.

శ్రీ‌కాంత్, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ పాత్ర‌లు ఎలా వుంటాయి?
ఇద్ద‌రివి చాలా గొప్ప పాత్ర‌లు. పోటా పోటీగా వుంటాయి. త‌ప్ప‌కుండా వాళ్ల పాత్రలు అంద‌రికి న‌చ్చుతాయి.

ఈ సినిమా ద్వారా జ‌నాల్లో మార్పు వ‌స్తుంద‌ని అనుకుంటున్నారా?
నేను చెప్పాల‌నుకున్న క‌థ‌లో నా భావాల‌ను చెప్పాల‌ని నేను ప్ర‌యత్నిస్తాను. దీని ద్వారా మార్పు తీసుక‌రావ‌ల‌నేది నా ల‌క్ష్యం కాదు. కాక‌పోతే మ‌న ప్ర‌య‌త్నం మ‌నం చేయాలి. ఈ చిత్రంలో ఓటు విలువ చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించాం.

Also Read:లక్ష్మీ పార్వతి ఓకే.. మరి బాలకృష్ణ ఏమిటి?

లింగిలింగిడి సాంగ్‌కు వ‌స్తున్న ఆద‌ర‌ణ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది?
ఈ సినిమాలో శ్రీ‌కాకుళం ఫోక్ పెట్టాల‌ని ఓ పెళ్లిలో విని ఈ సాంగ్‌ను పెట్టాం. ఈ పాటకు ఇంత ఆద‌ర‌ణ వ‌స్తుంద‌ని ఊహించ‌లేదు. ఈ పాట వ‌ల‌న మా సినిమా గురించి అంద‌రికి తెలిసింది. పాట కూడా సినిమాలో సిట్యుయేష‌న్ ప‌రంగా వుంటుంది.

భ‌విష్య‌త్‌లో మీ నుంచి ఎలాంటి సినిమాలు ఆశించ‌వ‌చ్చు?
నాకు అన్ని ర‌కాల సినిమాలు చేయాల‌ని వుంది. ఎమోష‌న‌ల్ డ్రామాలు, మాస్ క‌థ‌లు చెప్పాల‌ని వుంది.

- Advertisement -