కోట బొమ్మాళి పీఎస్..అప్‌డేట్

50
- Advertisement -

కోట బొమ్మాళి పీఎస్ చిత్రం నుంచి విడుద‌లైన లింగి లింగి లింగిడి అంటూ సాగిన శ్రీకాకుళం మాస్ జానపద పాటకు కొన్ని కోట్ల వ్యూస్ లభించడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇటీవ‌లే ఈ పాట 30 మిలియ‌న్స్ వ్యూస్ ను పూర్తి చేసుకుంది. న‌వంబ‌రు 24న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రం స‌న్సేష‌న‌ల్ చిత్రం నుంచి మ‌రో స‌న్సేష‌న్ ల‌ సాంగ్ కోట బొమ్మాళి టైటిల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. శ్రీ‌కాకుళం జిల్లాలోని కోట బొమ్మాళి గ్రామంలోని కోటమ‌తల్లి స‌న్నిధానంలో ఈ టైటిల్ సాంగ్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్‌.

ఉత్త‌రాంధ్ర‌ను ఊపేసేలా… శ్రీ‌కాకుళం చిందేసేలా అంటూ ఒక వైపు కోట‌మ్మ‌త‌ల్లి కొలువై వున్న కోట‌బొమ్మాళి గొప్ప‌దనం చెబుతూనే మ‌రో వైపు నేటి రాజ‌కీయాల‌కు, ఎన్నిక‌ల‌పై వ్యంగ్యాస్తంలా ఈ పాట వుంది. నేటి ఎన్నిక‌ల హ‌డావుడిలో ఈ సాంగ్ విడుద‌ల కావ‌డం అంద‌రిలోనూ ఆస‌క్తి రేకెత్తిస్తుంది. రాజ‌కీయ నాయ‌కుల‌కు, పోలిసుల‌కు మ‌ధ్య జ‌రిగే పొలిటిక‌ల్ డ్రామా నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం లో ఈ పాట మ‌రో సంచ‌ల‌న పాట కాబోతుంది. రంజిన్‌రాజ్‌సంగీత సార‌థ్యంలో రాంబాబు గోసాల సాహిత్యం అందించారు.

తెలుగులో ఇటీవ‌ల ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌ను అందించిన గీతా ఆర్ట్స్ 2 సంస్థ. GA2 పిక్చర్స్ బ్యానర్ మలయాళ సూపర్ హిట్ నాయాట్టు కి రీమేక్ గా *కోట బొమ్మాళి పీఎస్* ను నిర్మించింది ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాస్, విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు.తేజ మార్నిదర్శకుడు. శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోలీస్ కు రాజకీయనాయకుడికి మధ్య జరిగే పవర్ ఫుల్ పొలిటికల్ పవర్ గేమ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలంగాణలో ఎన్నికలు జరిగే సమయంలో నవంబరు 24న విడుదల కానుండంతొో ఈ సినిమాపై అందరిలోనూ మరింత ఆసక్తి పెరిగింది. , జోహర్, అర్జున ఫాల్గుణ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపునందుకున్న తేజ మార్ని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read:వింటర్‌లో చర్మ సౌందర్యానికి చిట్కాలు!

- Advertisement -