కొరటాల శివ ఇది నీకు తగునా ?, శ్రీమంతుడు సినిమాకు సంబంధించి కాపీ రైట్ యాక్ట్ కింద మొదలైన వివాదంలో కోర్టు తీర్పు ఇచ్చింది. కొరటాల ఆ సినిమా కథను కాపీ కొట్టాడు అని కోర్టు కూడా అభిప్రాయ పడింది. నిజానికి ఈ కేసును డైరెక్టర్ కొరటాల శివ చాలా రోజుల నుంచి ఎదుర్కొంటున్నారు. చచ్చేంత ప్రేమ పేరిట తాను రాసిన నవలలో స్వల్ప మార్పులు చేసి శ్రీమంతుడు పేరిట సినిమా తీశారు అనేది కోర్టు కూడా అంగీకరించింది. డైరెక్టర్ కొరటాల శివ, నిర్మాత ఎర్నేని రవి మాత్రం కాపీ కొట్టాం అని ఒప్పుకోవడం లేదు. పైగా ‘శ్రీమంతుడు’ ముఖ్య ఉద్దేశం..గ్రామాన్ని దత్తత తీసుకోవాలనేది మా ప్రధాన ఆలోచన అంటున్నారు.
కోర్టు నుంచి తీర్పు రాకుండా మేం ఎలాంటి కామెంట్లు చేయమని, అది చట్ట విరుద్దమని, తమకు న్యాయం, చట్టాల మీద నమ్మకం ఉందని మైత్రీ సంస్థ చెబుతూనే తమ కథ కాపీ కాదు అంటూ వాదిస్తున్నారు. పైగా రచయిత శరత్ చంద్ర తమ పై తప్పుడు క్రిమినల్ కేసు పెట్టారు అంటూ నీచపు కామెంట్స్ చేస్తున్నారు. అసలు కొరటాల శివకి కనీసం ఈ కేసు తీవ్రత అర్ధం కావడం లేదా ?, నిజంగా ఇది సిగ్గుచేటు. కొరటాల కథల్లో విలువులు ఉంటాయి అని పేరు. కానీ ఇప్పుడు అసలు కొరటాల శివలో విలువులు ఉన్నాయా ? లేవా ? అని అనుమాన పడాల్సి వస్తోంది.
కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా శ్రీమంతుడు స్టోరీ కాపీ వివాదం మీద ఇప్పుడేం స్పందించలేమని, శ్రీమంతుడు కథపై శరత్ చంద్ర చేస్తున్న ఆరోపణలు అన్నీ నిరాధారమైనవి అని, ఆ విషయంపై కోర్టు గాని, రచయితల సంఘం గాని ఎటువంటి తీర్పు ఇవ్వలేదని కొరటాల టీమ్ వాదిస్తూ వస్తోంది. కొరటాలా ఇది నీకు తగునా ?, ఒక్కసారి ఆలోచించు. వాస్తవం అందరూ గ్రహించారు అని అర్థం చేసుకో. శ్రీమంతుడు మూవీ, చచ్చేంత ప్రేమ నవల రెండు ఒకే కథ పై వచ్చాయి. అయినా పబ్లిక్ డొమైన్ లో కూడా మోసం చేయడం కుదరదు కొరటాల.. జరా జాగ్రత్త.
Also Read:ఇదేం ట్విస్టు.. రేషన్ కార్డు ఉంటేనే కరెంటు !