షాకింగ్..ఐదేళ్లలో రిటైర్ అవుతా: కొరటాల శివ

223
koratala siva
- Advertisement -

టాలీవుడ్‌లో హిట్ సినిమాలకు కేరాఫ్‌గా మారారు దర్శకుడు కొరటాల శివ. రచయితగా కెరీర్ మొదలుపెట్టిన శివ…సక్సెస్ ఫుల్ దర్శకుడిగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న కొరటాలకు ఇది ఐదో సినిమా.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో ఐదేళ్లలో తాను రిటైర్ కాబోతున్నానని వెల్లడించారు. ప్రస్తుతం తన దగ్గర ఉన్న స్క్రిప్టులతో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నానని, అవి పూర్తయిన తరవాత తాను దర్శకుడిగా రిటైర్మెంట్ తీసుకుంటానని స్పష్టం చేశారు.

అయితే దర్శకుడిగా రిటైర్మెంట్ తీసుకున్నా ఇండస్ట్రీని మాత్రం వదలనని అన్నారు. ఆచార్య మూవీ ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తయినట్టు వెల్లడించారు. సహజ వనరులను పరిరక్షించడం కోసం ఒక వ్యక్తి చేసే పోరాటామే ఆచార్య అని తెలిపారు.

- Advertisement -