‘కొరటాల’కు ఆ ఇద్దరి సాయం !

165
- Advertisement -

కొరటాల శివకి మంచి దర్శకుడిగా గొప్ప పేరు ఉంది. అయితే, అంతకు మించి మంచి మాటల రచయితగా కొరటాల శివకి లాంగ్ జర్నీ ఉంది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో కొరటాల శివ రాసే లోతైన మాటలకు ఎందరో అభిమానులు ఉన్నారు. అందుకే.. రచయితగా కూడా కొరటాల శివ సక్సెస్ అయ్యారు. ఒక విధంగా అది ఎంత బలమైన సీన్ అయినా సరే.. కొరటాల శివ ఒక్క పదంతోనే ఆ బలాన్ని తీసుకురాగలడు. తన నుంచి వచ్చిన డిజాస్టర్ సినిమా ఆచార్యలో కూడా కొరటాల శివ డైలాగ్స్ విషయంలో సూపర్ హిట్ అయ్యాడు.

కొరటాల శివ మాటలు అంత పదునుగా ఉంటాయి. సీన్ బిల్డ్ చేసే విషయంలో కూడా కొరటాల శివ అద్భుతంగా రాస్తాడు. ప్రస్తుతం కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ క‌థ‌కు ఎన్టీఆర్ ఎప్పుడో ఓకే చెప్పినా.. స్క్రిప్ట్ లోని సీన్స్ అండ్ డైలాగ్స్ విషయంలో మాత్రం ఎన్టీఆర్ మార్పులు చేర్పులు కోరుకుంటున్నాడు. మరోపక్క కొరటాల శివ ఆ మార్పులను సంతృప్తికరంగా చేయలేకపోతున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి.

దీనికితోడు కొరటాల శివ తాను ఇష్టపడి రాసుకున్న సీన్స్ లో లోపాలను వెతుక్కోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. అందుకే.. ఎన్టీఆర్ స్క్రిప్ట్ కోసం కొరటాల శివ మరో ఇద్దరు రచయితలను స్క్రిప్ట్ లో ఇన్ వాల్వ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రైటర్ ఏం రత్నంతో పాటు మరో రచయిత మచ్చ రవి ని కూడా కొరటాల శివ తన స్క్రిప్ట్ లో ఇన్ వాల్వ్ చేశాడట. నిజానికి, కొరటాల శివకి వీరి సాయం అవసరం లేదు. కానీ.. వారి ఆలోచనలు కొరటాల శివకి కొత్త ఆలోచనలకు దోహదం చేస్తున్నాయి. అందుకే.. కొరటాల శివ ఆ ఇద్దరి రచయితలను పెట్టుకున్నాడని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి…

తారక్ సినిమా కోసమే పుట్టాడు:జక్కన్న

కుర్ర హృదయాలను కూల్చేసింది !

వాటి కోసం ఇలియానా వెంపర్లాట

- Advertisement -