దేవర 2ను పక్కకుపెట్టిన కొరటాల?

7
- Advertisement -

దేవర సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు కొరటాల శివ ఆ తర్వాత దీని సీక్వెల్ పార్ట్ 2పై దృష్టి సారించారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దేవర 2ను పక్కకుపెట్టారట.

ఇందుకు కారణం మరిన్ని సినిమాలను తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారట. ఇందుకు సంబంధించి అనేక కథలు సిద్ధం చేసి, యువ దర్శకులకు అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులలో ఆయన క్రియేటివ్‌గా పాల్గొని, నిర్మాణ బాధ్యతలను కూడా తీసుకోబోతున్నారు.

ఈ సినిమాలను ఆయన తన యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మించనున్నారు. ఒకప్పుడు సంచలన దర్శకుడిగా నిలిచిన కొరటాల…చిరుతో తెరకెక్కించిన ఆచార్య అట్టర్ ఫ్లాప్ కావడంతో ఒక్కసారిగా కెరీర్ సందిగ్దంలో పడింది. అయితే దేవర సినిమాతో తిరిగి గాడిలో పడ్డాడు కొరటాల.

Also Read:ధవళేశ్వరం బ్యారేజ్ ..రెండో ప్రమాద హెచ్చరిక

- Advertisement -