మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి బ్లాక్‌బస్టర్లతో తనని తాను ప్రూవ్ కొరటాల శివ. అంతేకాదు 100 కోట్ల క్లబ్ దర్శకుడిగా మారిపోయాడు కూడా. మిర్చితో బ్లాక్‌బస్టర్ అందుకున్న కొరటాల ఆ తర్వత చరణ్‌తో ఓ సినిమా చేయాలని ట్రైచేశాడు. అందుకే కొరటాల వెంటనే చరణ్‌తో రామానాయుడులో సినిమా మొదలెట్టేశాడు. అయితే ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ అనూహ్యంగా క్యాన్సిల్ అయ్యింది. దీంతో శివకి చరణ్ ఝలక్ ఇచ్చినట్టైంది.
అయితే ఆ తర్వాత ఎన్టీఆర్‌తో కూడా సినిమా చేయాలని భావించి విఫలమయ్యాడు. ఆ పంతంతోనే మహేష్ కోసం ఏకంగా రెండున్నరరేళ్లు ఎదురు చూసి, శ్రీమంతుడు తీశాడు. లేటైనా లేటెస్టుగా హిట్ కొట్టాడు కొరటాల శివ. ఈ గ్యాప్‌లో బోలెడంత ఎమోషన్, వ్యథ దాగి ఉన్నాయనడంలో సందేహమేం లేదు. స్టార్ట్ అయిన సినిమా ఆగిపోవడం అంటే.. దర్శకుడిగా తనకు నామోషీనే. అందుకేనేమో ఇప్పుడు మెగా హీరోలతో బ్లాక్‌బస్టర్ కొట్టి చరిత్ర తిరగరాయాలని చూస్తున్నాడు.
ప్రస్తుతం మహేష్‌తో సినిమా పూర్తయిన వెంటనే మెగా హీరోలతో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు ఈ దర్శకుడు. అయితే ఈసారి అతడి క్యూలో పవన్, చరణ్, బన్ని ముగ్గురు హీరోలు ఉన్నారు. ఈ ముగ్గురికి కథలు వినిపిస్తాడని, ఎవరు ముందుగా గ్రీన్‌సిగ్నల్ ఇస్తే వారితో సినిమా మొదలెట్టేస్తాడని తెలుస్తోంది. మొత్తానికి గేమ్ ఇటు తిరిగి అటు తిరిగి తన కోర్టులోకే వచ్చింది. ఓ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా హీరోని ఎంచుకునే ఛాయిస్ ఇప్పుడు తనకి ఉంది.