బాహుబలి-2 ఈవెంట్‌కి రజిని..?

183

బాహుబలి-2 సునామి ఇప్పటికే మొదలైంది. ఈ సినిమా ట్రైలర్‌ సృష్టిస్తున్న సంచలనం మామూలుగా లేదు. ఇప్పుడు ఎక్కడచూసినా..బాహుబలి2 టాక్‌ ఓ రేంజ్‌లో వినిపిస్తోంది. అయితే ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌ తెగ ఎదురుచూస్తున్నారు. ఇక బాహుబలి2 పండగ మొదలవకముందే.. ఈ ఆదివారం భారీ ఈవెంట్‌కి రెడీ అయిపోతుంది బాహుబలిటీమ్‌.

 Thalaivar Rajinikanth likely to attend Baahubali 2 audio launch

ఈ ఆదివారం భారీ ఈవెంట్‌కి రామోజీ ఫిలింసిటీ సిద్ధ‌మ‌వుతోంది. రేపు సాయంత్రం 5 గంట‌ల నుంచి ప్ర‌భాస్, రానా అభిమానుల సంద‌డి ఆర్ఎఫ్‌సీలో మొద‌లు కానుంది. ఇప్ప‌టికే ఈ ఈవెంట్‌కి సంబంధించిన ఏర్పాట్లు భారీగానే జరుగుతున్నాయి. భారీ స్టేజ్‌.. భారీ భ‌ద్ర‌త మ‌ధ్య ఈ ఈవెంట్‌ ఉండబోతోంది. ఇక ఈ ఈవెంట్‌ కి క‌ర‌ణ్‌జోహార్‌, ఆలియా భ‌ట్‌, కృష్ణంరాజు వంటి అతిధులు ఎటెండ్ అవుతున్నారు.

అయితే వీరితో పాటు మరో స్టార్‌ కూడా ఈ ఈవెంట్‌ లో హంగామా సృష్టించడానికి రానున్నాడని తెలస్తోంది. స్పెష‌ల్ గెస్ట్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌ ప్ర‌త్య‌క్షం కానున్నారని టాక్‌. ఇప్పటికే బాహుబలి టీమ్‌ ర‌జ‌నీ ని ఈ ఈవెంట్ కోసం ఆహ్వానించార‌ని తెలిసింది.

Thalaivar Rajinikanth likely to attend Baahubali 2 audio launch

అయితే ర‌జ‌నీ వీలు కుదిరితే ఈ ఈవెంట్‌కి వ‌స్తారు. ఒక‌వేళ మిస్స‌యితే మాత్రం చెన్న‌య్‌లో ఏప్రిల్‌9న జ‌ర‌గ‌బోయే `బాహుబ‌లి-2` త‌మిళ వెర్ష‌న్ ప్ర‌మోష‌న్‌కి ఎటెండ్ అవుతార‌ని అంటున్నారు. ఇక్క‌డ మిస్స‌యినా, అక్క‌డ జ‌రిగే ఈవెంట్‌లో సూప‌ర్‌స్టార్ సంద‌డి ఉంటుంది.

ఇక చెన్న‌య్‌లో జ‌రిగే ఈ వెంట్‌కి టాప్ కోలీవుడ్ సెల‌బ్రిటీస్ అటెండ్ అవుతార‌ని తెలుస్తోంది. త‌మిళ హీరోలు సూర్య‌, కార్తీ ఎటెండ్ అయ్యే ఛాన్సుందట‌. ఇక ఈ చిత్రం వచ్చే నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగ‌తి తెలిసిందే.