రాష్ట్రంలో అన్ని కులాలు,మతాలకు ప్రాధాన్యం…

316
koppula
- Advertisement -

ఉర్దూ అకాడమీ ముద్రించిన “సౌకత్ -ఇ-ఉస్మానియా”పుస్తకాన్ని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. 50 ఫోటోలు, 472 పేజీలు గల ఈ పుస్తకాన్ని గురువారం మంత్రి కొప్పుల హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్,ఉర్దూ అకాడమీ ఛైర్మన్ రహీముద్దీన్ అన్సారీ, డైరెక్టర్ ఎం.డి.గౌస్, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మజీద్ బీదర్, ప్రొఫెసర్ ఫాతీమా పర్వీన్, చరిత్ర పరిశోధకులు,పుస్తక రచయిత ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ…ముఖ్యమంత్రి కెసిఆర్ మైనారిటీల భద్రతకు,సంక్షేమానికి అంకితభావంతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో అన్ని కులాలు,మతాలకు చెందిన వాళ్లంత సోదరభావం,సామరస్యంతో జీవిస్తున్నారు….ఉర్దూను ప్రభుత్వం రెండో అధికార భాషగా గుర్తించి,దాన్ని ఔన్నత్యాన్ని కాపాడుతుందన్నారు.

కెసిఆర్ కు తెలుగు, ఇంగ్లీష్ తో పాటు ఉర్దూ భాషపై కూడా మంచి పట్టుంది….204 గురుకులాల ద్వారా మైనారిటీలను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరానికి గొప్ప చరిత్ర ఉంది…6,7వ నిజాం నవాబులు హైదరాబాద్ ను గొప్పగా అభివృద్ధి చేశారు,మత సామరస్యాన్ని కాపాడారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్ మరింత వృద్ధి చెందింది,ప్రగతిపథాన పరుగులు పెడుతున్నది
…250ఫోటోలు,472పేజీలతో ఆకర్షణీయంగా,అర్థవంతంగా తీసుకువచ్చిన ఈ పుస్తకం విద్యార్థులు, పరిశోధకులు, చరిత్రకారులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఎంతగానో కష్టించి ఈ పుస్తకాన్ని తెచ్చిన ఎజాజ్,అందుకు సహాయపడిన ఉర్దూ అకాడమీ ఛైర్మన్ రహీముద్దీన్ అన్సారీలకు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు.

- Advertisement -