కేసీఆర్ గొప్ప పాలనాదక్షులు- మంత్రి కొప్పుల

132
Minister Koppula
- Advertisement -

భారత రాజ్యాంగ నిర్మాత, గొప్ప మేధావి, అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆ మహనీయునికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డాక్టర్ బి. ఆర్.అంబేద్కర్ పోరాట ఫలితంగానే రిజర్వేషన్లు అమలవుతున్నాయని, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో ఎస్సీ, ఎస్టీలు ఎదుగుతున్నారని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి కేసిఆర్ అంబేద్కర్ స్పూర్తితో ప్రజలందరి సంక్షేమానికి కృషి చేస్తూ నిజమైన అంబేద్కర్ వాదిగా ప్రశంసలు పొందుతున్నారన్నారని ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. విద్యతోనే నిజమైన ప్రగతి సాధ్యమన్న అంబేద్కర్ ఆశయాల ఆయన 125వ జయంతి సందర్భంగా 125 గురుకులాలు ప్రకటించి, కేవలం ఆరేండ్లలోనే 671 విద్యాలయాలను ఏర్పాటు చేసిన మహనీయులు కేసిఆర్ అని కొనియాడారు.

విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించేందుకు ఇష్టపడే విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద 20 లక్షల రూపాయలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నది. ఎస్సీల గృహాలకు 101 యూనిట్ల వరకు కరెంట్ ఉచితంగా సరఫరా చేస్తున్నామన్నారు. నామినేటెడ్ పదవుల పంపిణీలో కూడా రిజర్వేషన్లు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న కేసిఆర్ గొప్ప జన హృదయ నాయకులని కొప్పుల ప్రశంసించారు. ఎస్సీలకు బడ్జెట్లో కేటాయించిన నిధులు పూర్తిగా వారికే చెందాలన్న సంకల్పంతో ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని తీసుకువచ్చిన కేసిఆర్ గొప్ప పాలనాదక్షులని ఈశ్వర్ వివరించారు.

అంబేద్కర్ 64.వ వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలను గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా తెలంగాణకు, కెసిఆర్ కు మరింత మంచి పేరు తేవడం.. ఉన్నత స్థాయికి చేరడమే అంబేద్కర్ కు మనమిచ్చే నిజమైన నివాళి అని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు సంజయ్ పాల్గొన్నారు

- Advertisement -