అన్నివర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌కే మద్దతు- మంత్రి

53
koppula

బుధవారం 35వ డివిజన్ వెంకటాపురం డివిజన్‌లో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించి పార్టీ అభ్యర్థి సబితాకిశోర్‌కు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా డివిజన్‌లోని క్రిస్టియన్లు,బోహ్రా ముస్లింలు,ఎస్సీలు,ఎస్టీలు,మాజీ సైనికోద్యోగులు టిఆర్ఎస్‌కు తమ సంపూర్ణ ప్రకటించారు. కారు గుర్తుకు ఓటేసి టిఆర్ఎస్‌కు భారీ మెజార్టీ వచ్చేందుకు దోహదపడ్తామన్నారు. జై తెలంగాణ జైజై తెలంగాణ,వర్థిల్లాలి వర్థిల్లాలి కెసిఆర్ నాయకత్వం వర్థిల్లాలి, కారు గుర్తుకే మన ఓటు, జిందాబాద్ జిందాబాద్ టిఆర్ఎస్ జిందాబాద్ అనే నినాదాలు హోరెత్తాయి.

కెసిఆర్ నాయకత్వంలోనే హైదరాబాద్ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని బోహ్రా ముస్లింలు, క్రిస్టియన్లు స్పష్టం చేశారు. తమ సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న కెసిఆర్ గారికి గతంలో సంపూర్ణ మద్దతునిచ్చామని,ఇది ఇక ముందు కూడా కొనసాగుతుందని మాజీ సైనికులు,ఎస్సీలు,ఎస్టీలు చెప్పారు. క్రిస్టియన్లు కెసిఆర్ పాలనను మెచ్చుకుంటూ, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రార్థన చేశారు.

హైదరాబాద్ మహానగరంలో శాంతి భద్రతలు సజావుగా ఉన్నాయి. మైనారిటీల భద్రతకు, హక్కుల పరిరక్షణకు, ఉన్నతికి కెసిఆర్ తీసుకున్న, తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. స్వతహాగా వ్యాపారస్తులమైనా తాము గతంలో కంటే కెసిఆర్ పాలనలో ప్రశాంతంగా జీవనం గడుపుతున్నాం. హైదరాబాద్ ఈ ఆరున్నర ఏండ్లలో గొప్పగా అభివృద్ధి చెందింది. మౌలిక సదుపాయాలు చాలా మెరుగయ్యాయి. కెసిఆర్‌కు, టిఆర్ఎస్‌కు తాము భేషరతుగా సంపూర్ణ మద్దతు తెల్పుతున్నాం, ఇకముందు కూడా అండగా నిలుస్తామని బోహ్రాస్ మత ప్రముఖులు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్నివర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌కే మద్దతుగా నిలుస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చక్కని పాలన అందిస్తున్నారు. కెసిఆర్ అంటే తెలంగాణ ప్రజలందరితో పాటు అన్ని మతాల వారికి కూడా చాలా ఇష్టం అన్నారు.