బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఎస్సి,,ఎస్టీ స్టడీ సర్కిల్లో పోలీస్ శాఖ విభాగంలో స్టడీ సర్కిల్ ద్వారా ఎస్.ఐ లు ఎన్నికైన ప్రతి విద్యార్థి విద్యార్థుల సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 2019-2020 సివిల్స్ సర్వీస్ పోటీ పరీక్షలకు అగస్టు 9వ తేదీ నుండి టి.ఎస్ ఎస్సి స్టడీ సర్కిల్ ద్వారా కోచింగ్ తీసుకోబోతున్నావిద్యార్థుల అభినందన కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, తెలంగాణ రాష్ట్ర ఎస్సి, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర CS SCDD (చీఫ్ సెక్రెటరీ ఎస్సి డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ) IAS అజయ్ మిశ్రా, SCDD డైరెక్టర్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి స్టడీ సర్కిల్ ఫెసిలిటేషన్ కార్యక్రమానికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కోచింగ్ తీసుకొని 39 మంది ఎస్.ఐగా ఎంపిక అయిన ప్రతి ఒక్కరికి, సివిల్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు నా అభినందనలు. అని మంత్రి తెలిపారు.
ఇలాంటి స్టడీ సర్కిల్లో సిటు దొరకడం మీ అదృష్టం. ఎందుకంటే ఒకప్పటి స్టడీ సర్కిళ్ళు వేరు తెలంగాణ రాష్ట్రం వచ్చాక స్టడీ సర్కిళ్ళు వేరూ..అన్ని పథకాలతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ విద్య కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ గొప్ప ఫలితాలను సాధించుకుంటున్నామంటే మన అదృష్టం. ఎస్సి, ఎస్టీ, బిసి, మైనారిటీ వెల్ఫర్ విద్య వ్యవస్థకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మంచి విద్యను అందిస్తున్నాం కాబట్టే ఇప్పడు 10 జిల్లాలో 10 స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసుకోగల్గినం. ఒకప్పుడు స్టడీ సర్కిల్ వేరేలా ఉండేది. కానీ మార్పులో భాగంగా ఊహకు అందనంత ముందుకు దూసుకెళ్తూ తెలంగాణ ప్రభుత్వ స్టడీ సర్కిల్లు తీర్చిదిద్దబడుతున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఎస్సి ఎస్టీ రాష్ట్ర కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. నాడు ఏ స్టడీ సర్కిల్‌కు అయితే విద్యార్థి నాయకునిగా కొట్లాడి స్టడీ సర్కిల్ సాదించుకున్నామో నేడు అదే స్టడీ సర్కిల్‌కు అతిథిగా రావడం నా అదృష్టం. దీనికి కారణం ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాదించుకున్నాక విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. గత ప్రభుత్వంలో లోయర్ ట్యాంక్ బ్యాండ్ 2006లో ఎపి స్టడీ సర్కిల్లో మూడు ప్రాంతాలకు కలిపి హైదరాబాద్‌లో ఒక్కటే స్టడీ సర్కిల్ ఉండేది.. మిగిలినవి అన్ని రాయసీమ, ఆంధ్ర ప్రాంతాలలో ఉండేవి.
నేను ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయకునిగా ఉన్నప్పుడు తెలంగాణా ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరిగింది. ఈవిషయంలో ఏం జరిగిందో పాత విద్యార్థులకు మాత్రమే తెలుసు అప్పుడు మన చేసిన ధర్నాకు 16 శాతం ఇచ్చారు. కానీ మాకు కావాల్సింది 16 శాతం కాదు మా వాటా ఎంత అని అడిగితే అప్పుడు ధర్నాలు, ర్యాలీలు గత ప్రభుత్వ నేతలపై ఒత్తిడి తెస్తే ఈ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కొత్తలో 4 సంవత్సరాలలో 10 స్టడీ సర్కిళ్ళు ఏర్పాటు చేసుకున్నాం కానీ 50 ఏండ్లు పరిపాలించిన నాయకులు మాత్రం ఒక్కటే ఏర్పాటు చేశారు.అని ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు.