మట్టి గణేష్‌లను పూజించండి-మేయ‌ర్

240
Mayor Bonthu Rammohan
- Advertisement -

ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన‌ మట్టి గణేష్‌లనే పూజించాల‌ని న‌గ‌ర‌ మేయ‌ర్ బోంతు రామ్మోహ‌న్ పిలుపు నిచ్చారు. దైవజ్జ శర్మ అద్వ‌ర్యంలో మ‌ట్టి గ‌ణ‌పతుల తయారీని ప్రోత్సహించేందుకు చేపట్టిన కార్యక్రమాన్ని జిహెచ్ఎంసి కార్యాలయంలో మేయర్ రామ్మోహన్, జీహెచ్ఎంసి కమిషనర్ ఎం.దానకిషోర్, ఇ.పి.టి.ఆర్.ఐ డైరెక్టర్ జనరల్ కల్యాణ్ చక్రవర్తి, జోనల్ కమిషనర్లతో కలిసి ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా రామ్మోహ‌న్ మాట్లాడుతూ ప‌ర్యావ‌ర‌ణానికి తీవ్ర‌ న‌ష్టం క‌ల్గించే ప్లాస్ట‌ర్ అప్ పారిస్ విగ్రహాల నిమ‌జ్జ‌నంతో న‌గ‌రంలోని చెరువులు, కుంట‌లు కాలుష్యం బారీన ప‌డ్డాయ‌ని, దీంతో ప‌క్షులు,చేప‌ల ఉనికి పూర్తిగా క‌నుమ‌రుగైంద‌ని పెర్కోన్నారు. గ్రేట‌ర్ ప‌రిధిలోని 169చెరువుల‌ను ద‌శ‌ల వారిగా పూర్తి స్థాయిలో అభివృద్ది చేప‌డుతున్నామ‌ని అన్నారు. న‌గ‌రంలో వినాయక విగ్ర‌హాల నిమ‌జ్జ‌నానికి ప్రత్యేకంగా 23 కోల‌నులను నిర్మించామని తెలిపారు.

హైద‌రాబాద్ నగ‌రంలో మ‌ట్టి వినాయ‌కుల త‌యారి వ‌ల్ల వృత్తిదారుల‌కు పూర్తి స్థాయిలో ఉపాధి క‌లిగే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. హైదార‌బాద్ న‌గ‌రంలో ప్ర‌జా ప్ర‌తినిధులు గ‌ణేష్ విగ్రాహాల‌ కోసం చందాలు ఇవ్వ‌కుండా మ‌ట్టి విగ్ర‌హాల‌ను బ‌హుక‌రించాల‌న్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్లు శంకరయ్య, శ్రీనివాస్ రెడ్డి, మమత, చీఫ్ ఇంజనీర్లు సురేష్, జియాఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్, ఇ.పి.టి.ఆర్.ఐ డిజిలకు మట్టి వినాయకులను అందజేశారు.

- Advertisement -