దేశానికే ఆదర్శంగా రైతు సంక్షేమ పథకాలు- మంత్రి కొప్పుల

41
minister koppula

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా గొల్లపల్లి మండలం చందోళీ గ్రామంలో రైతు వేదిక,సీసీ రోడ్లు, 40 లక్షలతో జంగిల్ నాల, ప్రాజెక్టు వెళ్లె బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన, వైకుంఠ ధామం, దాదాపు 1కోటి 20 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ.. దేశానికే ఆదర్శవంతంగా మన రైతాంగాన్ని తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని మంత్రి అన్నారు. రైతు సంక్షేమ ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా రూ.600 కోట్లు ఖర్చు చేసి 2601 రైతు వేదికలను నిర్మించామని, ప్రపంచంలో ప్రభుత్వం రైతులకు వేదికలు నిర్మించడం తెలంగాణలో మాత్రమే జరిగిందని తెలిపారు.2014 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో రైతులు 2 పంటలు కలిపి 30 లక్షల ఎకరాల మాత్రమే వరి సాగు చేసారని, అక్కడి నుంచి ప్రస్తుతం రెండు పంటలు కలిపి రాష్ట్రంలో 1 కోటి 30 లక్షల ఎకరాల వరి సాగు జరిగిందని అన్నారు.

గత ఆరు సంవత్సరాలుగా రైతు అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను అందిసుతన్నాయని అన్నారు. నూతన రాష్ట్రం ఏర్పడిన 6 మాసాలో విద్యుత్ సమస్యను అధిగమించి రైతులకు నాణ్యమైన 3 ఫేస్ విద్యుత్ 24 గంటల పాటు ఉచితంగా రైతులకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తెలిపారు. ప్రతి సంవత్సరం రూ.1200 కోట్లు ఖర్చు చేసి రైతుకు భద్రత కల్పించే దిశగా రైతు బీమా పథకం అమలు చేస్తున్నామని, కరోనా సంక్షోభ సమయంలో సైతం రైతు బంధు పథకానికి కోతలు విధించకుండా 15 వేల కోట్లకు పైగా నిధులను రైతుల ఖాతాలో జమ చేసామని మంత్రి అన్నారు.గత 6 సంవత్సరాలుగా ప్రభుత్వం రైతుల వద్ద నుండి మద్దతు ధరకు పూర్తి స్థాయిలో ధాన్యం కోనుగొలు చేస్తుందని, మన సరిహద్దు రాష్ట్రాలైన మహరాష్ట్ర, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలో అక్కడి ప్రభుత్వాలు ధాన్యం కొనుగొలు చేయవని మంత్రి తెలిపారు.

రైతు భూ హక్కులను సంపూర్ణంగా రక్షించేందుకువారికి ఉన్న సమస్యలు తొలగించేందుకు వీలుగా ధరణి పోర్టల్ రుపొందించామని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం పూర్తి రైతు వ్యతిరేక వైఖరి ఆవలంభిస్తుందని, రాష్ట్రంలో రైతుల అభ్యున్నతికి సీఎం కృషి చేస్తుంటే, నూతన వ్యవసాయ చట్టాలతో కేంద్రం రైతులను గందరగోళానికి గురి చేస్తుంది.రైతులకు సాగునీరు అందించేందుకు చేపట్టిన ప్రాజేక్టులు వేగవంతంగా పూర్తి చేసుకుంటున్నామని, కాళేశ్వరం వంటి భారి ఎత్తిపోతల పథకం నిర్మించామని తెలిపారు.రైతుల సంక్షేమం కోసం లక్ష కళ్లాలను సైతం నిర్మించామని, వచ్చే సంవత్సరం మరిన్ని కళ్లాలు నిర్మిస్తామని తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో సైతం ప్రజా సంక్షేమ పథకాలకు ఎలాంటి కోత విధించ లేదని కళ్యాణ లక్ష్మీ, షాదీ ముభారక్, ఆసరా పెన్షన్లు, రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలను కొనసాగించామని తెలిపారు. రైతుల కోసం నిర్మించిన రైతు వేదికలను, కల్పిస్తున్న సదుపాయాలను రైతులు వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.

రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలి.జిల్లాలో 54 రైతు వేదికల నిర్మాణ పనులు పూర్తి చేసామని, ప్రతి వ్యవసాయ క్లస్టర్‌లో వ్యవసాయ విస్తరణ అధికారి విధులు నిర్వహిస్తున్నారని, రైతులకు అవసరమైన సలహలు సూచనలు అందిస్తారని తెలిపారు.రైతు వేదికల నిర్వహించే శిక్షణ కార్యక్రమాలకు రైతులు హజరుకావాలని, వారి సందేహలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. రైతు వేదికలను వినియోగించుకుంటూ రైతులు మార్కెట్‌లో పంట డిమాండ్, గిట్టుబాటు ధర, పంటలు పండించడంలో మెలుకవులు, ఎరువులు, విత్తనాల వినియోగం వంటి వాటిపై చర్చించాలని, మంచి పద్దతులను తెలుసుకొని పాటించాలని సూచించారు. చందోలి గ్రామం లో తెలిసి ఈ పది సంవత్సరాల కాలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి.

మన ముఖ్యమంత్రి మనం అడక్కుండానే ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఒంటరి మహిళలకు పెన్షన్ వస్తుంది, వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ వస్తుంది, రైతు బీమా వస్తుంది, రైతుకు సంబంధించిన రైతుబంధు వస్తుంది, దాదాపు ఒక గ్రామానికి ఒక కోటి కోటి రూపాయలు ఒక గ్రామానికి ప్రభుత్వం నిధులు వస్తాయి, కల్యాణలక్ష్మి కింద డబ్బులు వస్తున్నాయి,అదే విధంగా మరి మాతా శిశు ప్రోగ్రామ్ కింద ఆడపిల్ల పుడితే 13 వేల రూపాయలు మగబిడ్డ పుడితే 12 వేల రూపాయలు వస్తున్నాయని మంత్రి వివరించారు.