బాల‌కృష్ణ‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన నాగ‌బాబు..

298
nagababu
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడు నాగ‌బాబు ప‌లు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటివ‌లే వ‌చ్చిన గీత గోవింద‌, అర‌వింద స‌మేత వీర రాఘ‌వ సినిమాల్లో న‌టించాడు. అలాగే బుల్లి తెర‌పై ప్ర‌సార‌య‌య్యే కామెడీ షోస్ ల‌లో జ‌డ్జ్ గా కూడా వ్య‌వ‌హారిస్తున్నారు. తాజాగా ఆయ‌న ఓ మీడియా ఛానల్ కు ఇంట‌ర్యూ ఇచ్చాడు. ఈఇంట‌ర్యూలో ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

nagababu balakrishna

బాల‌కృష్ణ మీకు తెలుసా అని అడ‌గ‌గా..ఆయ‌నెవరో నాకు తెలియ‌ద‌ని చెప్పేశారు. ఆ త‌ర్వాత సీనియ‌ర్ న‌టుడు బాల‌య్య నాకు తెలిసు త‌ప్ప మ‌రెవ‌రూ తెలియ‌ద‌న్నారు. యాంక‌ర్ మ‌రోసారి అడ‌గ‌గా చిరాకు ప‌డుతూ త‌నెవ‌రో నాకు తెలియ‌ద‌ని సీరియ‌స్ గా చెప్పారు. ఈసంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ గురించి అడ‌గ‌గా ఆయ‌న గురించి తాను చిరంజీవి 150సినిమా ఆడియో ఫంక్ష‌న్ లోనే చెప్పాన‌ని..అత‌ని పేరు ప‌ల‌కడం కూడా త‌న‌కు ఇష్టం లేద‌ని చెప్పారు.

- Advertisement -