మెగాహీరో మూవీకి సెన్సార్ పూర్తి..

191
Panja Vaisshnav Tej
- Advertisement -

ఉప్పెన వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం త‌ర్వాత మెగాసెన్సేష‌న్ వైష్ణవ్ తేజ్ హీరోగా న‌టిస్తున్నరెండవ చిత్రం కొండ పొలంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అద్భుతమైన యాక్షన్ మ‌రియు అడ్వెంచ‌ర‌స్ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై ఈ చిత్రం రూపొందుతోంది.

ఈ చిత్రం అక్టోబర్ 8న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. దీంతో ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో జ‌రుగుతున్నాయి. తాజాగా కొండ‌పొలం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఈ మూవీకి సెన్సారు వారు ఎలాంటి క‌ట్స్ చెప్ప‌కుండా క్లీన్ యూ స‌ర్టిఫికేట్ ఇవ్వ‌డంతో పాటు సినిమా చూసి మేకర్స్ ను ప్రశంసించారు. కొండ‌ పొలం 2:15గంట‌ల ప‌ర్‌ఫెక్ట్ ర‌న్‌టైమ్‌తో ప్రేక్ష‌కుల‌ముందుకు రాబోతుంది.

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ మ‌రియు ‘ఓబులమ్మ’ ‘శ్వాసలో’ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల వచ్చిన థియేట్రికల్ ట్రైలర్ మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. బిబో శ్రీనివాస్ సమర్పిస్తున్న ఈ మూవీ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతోంది.

కర్నూలులోని సంతోష్ నగర్ కాలనీలోని కర్నూలు కన్వెన్షన్ సెంటర్ లో రేపు కొండపొలం ఆడియో లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమం సాయంత్రం 5గంటల నుండి ప్రారంభమవుతుంది. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫీ అందించగా.. రాజ్ కుమార్ గిబ్సన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. శ్రవణ్ కటికనేని దీనికి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

నటీనటులు : పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్
సాంకేతిక బృందం
దర్శకుడు: క్రిష్ జాగర్లమూడి
నిర్మాత : సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి
బ్యానర్ : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్
సంగీతం : ఎంఎం కీరవాణి
సినిమాటోగ్రఫర్ : జ్ఞాన శేఖర్ వీఎస్
కథ : సన్నపురెడ్డి వెంకట రామి రెడ్డి
ఎడిటర్ : శ్రావన్ కటికనేని
ఆర్ట్ : రాజ్ కుమార్ గిబ్సన్
కాస్టూమ్స్ : ఐశ్వర్యా రాజీవ్
ఫైట్స్: వెంకట్
పీఆర్వో : వంశీ-శేఖర్

- Advertisement -